టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి పవర్ ఫుల్ మాస్ రోల్ లో చేస్తున్నారు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన, కంప్లీట్ గా డౌన్ లోకి తీసుకొచ్చి ఈ రోల్ ని త్రివిక్రమ్ డిజైన్ చేశారు.
ఈ మూవీకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 80 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారంట. నాన్ పాన్ ఇండియా స్టార్స్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా మహేష్ బాబు ఇప్పుడు రికార్డు సృష్టించాడు.
నాన్ పాన్ ఇండియా హీరోలు అంటే ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పెద్ద హీరోలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డే కాల్ షీట్స్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రోజుకి రెండు కోట్లు అతని బడ్జెట్, ఇక మెగాస్టార్ చిరంజీవి 50 కోట్ల వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. దీనికి కారణం కూడా ఉంది. శ్రీమంతుడు మూవీ తర్వాత సూపర్ స్టార్ నుంచి వచ్చిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. ఈ కారణంగానే అత్యధిక రెమ్యునరేషన్ అతనికి ఇస్తున్నట్లు తెలుస్తోంది.