మహావతార్ 10 రేట్లు ఎక్కువగా లాభాలు.. ఓవరాల్ ఎంతంటే?
మేకర్స్ ఆఫ్ కేజీఎఫ్, సలార్.. గతనెల మహావతార నరసింహ యానిమేటెడ్ సినిమా రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 18 Aug 2025 4:50 PM ISTమేకర్స్ ఆఫ్ కేజీఎఫ్, సలార్.. గతనెల మహావతార నరసింహ యానిమేటెడ్ సినిమా రిలీజ్ చేశారు. అతి తక్కువ బడ్జెట్ తో, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. రిలీజై నాలుగు వారాలు గడుస్తున్నా.. డీసెంట్ ఆక్యుపెన్సీతో ఇంకా థియేటర్లలో నడుస్తోంది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగానూ మహావతార రికార్డు సృష్టించింది.
ప్రమోషన్లు లేకుండా జులె 25న రిలీజైన మహావతార ఇప్పటికే రూ.250 కోట్లు కొల్లగొట్టింది. భారీ బడ్డెట్, బడా స్టార్లను పెట్టి తీస్తున్న సినిమాలు కూడా సరిగ్గా ఆడడం లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మహావరాత మాత్రం అద్భుతమైన వసూళ్లు చేస్తోంది. దీంతో పెద్ద నిర్మాతలు సైతం ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి షాక్ కు గురువుతున్నారు. అయితే మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ కు భారీ గానే ఖర్చు చేసింది. ఆ ఖర్చుకు తగ్గ వసూళ్లు కూడా రావడంతో మేకర్స్ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు.
దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ప్రస్తుతం ఫైనల్ థియేట్రికల్ రన్నింగ్ స్టేజ్ లో ఉందీ సినిమా. ఓవరాల్ గా మహావతార్ 10 రేట్లు ఎక్కువగా లాభాలు ఆర్జిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా తాజాగా ఈ సినిమా నాన్- థియేట్రికల్ అగ్రిమెంట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. భారీ ధరకే ఈ హక్కులు అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. ఈ యూనివర్స్ నుంచి తదుపరి సినిమాలు రానున్నాయి.
ఈ నేపథ్యంలో మహావతార నరసింహ రెవెన్యూ తదుపరి సినిమాల ప్రీ- ప్రొడక్షన్ పనులకు లైన్ క్లియర్ అయినట్లే. ఈ యూనివర్స్ లో రానున్న తదుపరి సినిమాలన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. ఈ సినిమా ఎలాంటి అర్భాటలు లేకుండా రిలీజైంది. దీంతో ఓపెనింగ్స్ పెద్దగా చెప్పుకునే స్థాయిలో రాలేదు. కానీ మౌత్ టాక్ తో మాత్రం ఫుల్ హైప్ వచ్చింది. తొలి వీకెండ్ లోనే అద్భుతంగా పుంజుకుంది. అలా రోజు రోజుకూ భారీ స్థాయిలో వసూల్ చేసి ఔరా అనిపించింది. ఓవరాల్ గా ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాగా నిలిచింది.
