Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ… లెక్క ఎంతవరకు వెళ్లిందంటే..

కల్కి2898ఏడీ కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు.

By:  Tupaki Desk   |   6 July 2024 9:23 AM GMT
కల్కి 2898ఏడీ… లెక్క ఎంతవరకు వెళ్లిందంటే..
X

కల్కి2898ఏడీ కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. వారం రోజుల తర్వాత కూడా ప్రేక్షకులలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడటానికి థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. నాగ్ అశ్విన్ సృష్టించిన విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులు ఆశ్వాదిస్తున్నారు. సినిమా చూసిన తర్వాత పెట్టిన టికెట్ రేట్ కి తగ్గ సంతృప్తి లభించిందని ఆడియన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ ఏడాది రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అలాగే ఇంతకాలం ఇండియన్ పర్టిక్యులర్ బౌండరీస్ లోనే ఉండేవి. ముఖ్యంగా పీరియాడిక్ కథలు లేదంటే ప్రెజెంట్ జెనరేషన్ స్టోరీస్ మాత్రమే తెరపై మన దర్శక నిర్మాతలు చూపిస్తూ వచ్చారు. అయితే నాగ్ అశ్విన్ తన ఆలోచనలని ఫ్యూచర్ లోకి పంపించి సరికొత్త ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. అందుకే కల్కి చిత్రానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 800+ కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.

తాజాగా చిత్ర యూనిట్ కలెక్షన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. శని, ఆదివారాలు 100 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రెండు వారాల్లో కల్కి మూవీ 1000 కోట్ల టార్గెట్ ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో కూడా ఇప్పటి వరకు 14.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి మూవీ సొంతం చేసుకుందట.

ఓవర్సీస్ లో సలార్ కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం నాడు కల్కి 2డి వెర్షన్ తెలుగు మార్కెట్‌లో 31.99 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. 3D వెర్షన్ 31.06 శాతం ఆక్యుపెన్సీ అయ్యిందంట. శని, ఆదివారాలు ఆక్యుపెన్సీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా కల్కి 2898ఏడీ మంచి వసూళ్లని సాధిస్తోంది. ఇప్పటి వరకు 175 కోట్ల కలెక్షన్స్ ని హిందీ బెల్ట్ లో కల్కి సాధించిందని తెలుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ ఇమేజ్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సుమతిగా దీపికా పదుకునే నటన ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. అలాగే నాగ్ అశ్విన్ సృష్టించిన ఫ్యూచర్ వరల్డ్ కూడా ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కారణంగా కల్కి మూవీకి ప్రేక్షకులని ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ సక్సెస్ తో కల్కి 2898ఏడీ పార్ట్ 2 మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.