Begin typing your search above and press return to search.

కాజల్ సత్యభామ… కలెక్షన్స్ ఎంతంటే?

మొదటి రోజు కేవలం 26 లక్షల షేర్ మాత్రమే రావడంతో ఇంకా 3.44 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 4:06 AM GMT
కాజల్ సత్యభామ… కలెక్షన్స్ ఎంతంటే?
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సత్యభామ. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సత్యభామకి కచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేసింది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ బాగా వస్తారని భావించారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.

ఈ మధ్యకాలంలో ఒక్క స్టార్ హీరోల సినిమాలు తప్ప మిగిలిన వాటిని థియేటర్స్ లో చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ కారణంగానే బాగుందనే టాక్ వచ్చిన సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించలేకపోతున్నాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం చెప్పుకోదగ్గ విధంగా రాలేదు.

ఇక చిన్న సినిమాల సంగతి అంటే సరేసరి. తాజాగా రిలీజ్ అయిన సత్యభామ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ప్రేక్షకులు నుంచి ఏ స్థాయి స్పందన వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ మొదటి రోజు కేవలం 26 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ కూడా సత్యభామ సినిమాకి ప్రేక్షకులని రప్పించలేకపోయింది. ఈ చిత్రంపై 3.5 కోట్ల బిజినెస్ జరిగింది.

టీజర్, ట్రైలర్ బాగుండటంతో పాటు స్టార్ హీరోయిన్ లీడ్ రోల్ లో చేస్తోన్న చిత్రం కావడంతో ఈ స్థాయిలో బిజినెస్ అయ్యింది. దీంతో 3.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సత్యభామ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. మొదటి రోజు కేవలం 26 లక్షల షేర్ మాత్రమే రావడంతో ఇంకా 3.44 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ పూర్తయితే సత్యభామ సినిమాకి పబ్లిక్ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందనేది ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే చిన్న సినిమాలు థియేటర్స్ లో పెద్దగా వసూళ్లు చెకపోయిన ఓటీటీ బిజినెస్ ఉండటంతో నిర్మాతలు కొంత సేఫ్ అవుతున్నారు. స్టార్ క్యాస్టింగ్ ఉన్న సత్యభామ లాంటి చిత్రాలని ఓటీటీ ఛానల్స్ వారు మంచి ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అయితే థియేటర్స్ లో రిలీజ్ చేయడం అనేది కంపల్సరీ చేయడంతో వారం రోజులైనా థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారనేది సినీ విశ్లేషకుల మాట.