'రేయ్ ఇక్కడ నేనేరా కింగ్... హుకుమ్'.. అంటూ సూపర్ స్టార్ రజనీ కాంత్ 'జైలర్' సినిమాలో డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఆయన ఆ చిత్రంతో ఇండియన్-వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. మెుదటి రోజు నుంచి ఈ చిత్రం కళ్లు చెదిరే వసూళ్లతో దుమ్మురేపుతోంది. విడుదలై పది రోజులు అవుతున్నా.. ఎక్కడా అస్సలు ఎక్కడా తగ్గట్లేదు. గతేడాది విడుదలైన మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్', కమల్ హాసన్ 'విక్రమ్' రికార్డులను బ్రేక్ చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా సుమారు రూ.500కోట్ల మార్క్‌ను టచ్ చేయబోతోంది. ఇప్పటివరకు పది రోజుల్లో రూ.474 కోట్ల గ్రాస్, రూ.231.95 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో రూ.141.5 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 63.30కోట్లు(తమిళ వెర్షన్‌తో కలిపి), కర్ణాటక రూ.54.10కోట్లు, కేరళ రూ.41.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.10.50కోట్లు, ఓవర్సీస్ రూ.163.10కోట్లు వసూళ్లను అందుకుంది. అలా మొత్తంగా రూ.474కోట్లను ఖాతాలో వేసుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ వరల్డ్‌వైడ్‌గా మార్కెట్ ఉన్న సంగతి తెలిసింది. ఆయన సినిమా అంటేనే భారీగా బిజినెస్ జరుగుతుంది. ఈ చిత్రానికి ఓవరాల్‌గా వైరల్డ్ వైడ్ రూ.122.50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ.124 కోట్లు. అంటే ఈ లెక్కన చూస్తే సినిమా ఇప్పటికే రూ.107.95కోట్ల లాభాల్ని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ప్రస్తుతం హవా చూస్తుంటే మరో వీకెంట్ కూడా మరిన్ని వసూళ్లను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టాలీవుడ్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా 'జైలర్' బాక్సాఫీస్ ఊచకోత కోస్తోంది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన మెగాస్టార్ భోళాశంకర్ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ టాక్‌తోనే నెగటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీ డ్రాప్ అయిపోయి థియేటర్లలోని నుంచి ఆ సినిమాను తీసేసి జైలర్‌ను ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా జైలర్‌ను చూసేందుకు భారీగానే వస్తున్నారు. ఈ సినిమా ఇక్కడ రూ.12కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.13కోట్లు. ఈ సినిమాకు ఇప్పటికే రూ.24.09కోట్ల లాభాలు అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్‌గా నిలిచింది.
ఇంకా ఈ సినిమా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీష్రాఫ్, సీనియర్ నటి రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తమన్నా ఓ రోల్లో మెరిసింది. స్పెషల్ సాంగ్‌తో అలరించింది. టాలీవుడ్ కెమెడియన్ సునీల్ తన కామెడీతో ఆకట్టుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సెన్సేషన్ మ్యూజిక్ అందించారు. సన్‌పిక్చర్స్ సినిమాను నిర్మించింది.