Begin typing your search above and press return to search.

బిజినెస్ మెన్ రీ రిలీజ్… ఈ బుకింగ్స్ ఏంటి బాబోయ్..

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Aug 2023 11:10 AM GMT
బిజినెస్ మెన్ రీ రిలీజ్… ఈ బుకింగ్స్ ఏంటి బాబోయ్..
X

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో రెండో సారి ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించాయి. ఇలా వచ్చిన సినిమాలలో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా ఖుషి నిలిచింది. దీని తర్వాత స్థానంలో సింహాద్రి, ఆరెంజ్ మూవీస్ ఉన్నాయి. రీసెంట్ గా తమిళ్ హీరో సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ కూడా రీరిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ లభించింది.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ బిజినెస్ మెన్ రీరిలీజ్ కాబోతోంది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా బిజినెస్ మెన్ రీరిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందిన్చింగ్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయంట. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు 1.36 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యిందంట. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు కావడం మూవీపై ఉన్న బజ్ ని తెలియజేస్తోంది.

అలాగే ఓవర్సీస్ లో కూడా 20 లక్షల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయంట మొత్తం 1.55 కోట్ల గ్రాస్ ని బిజినెస్ మెన్ కలెక్ట్ చేసింది. ఈ చిత్రంతో సరికొత్త రికార్డులు క్రియీట్ చేయాలని సూపర్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు. బుకింగ్స్ లో 58 శాతం ఆక్యుపెన్సీతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకొన్న బిజినెస్ మెన్ కచ్చితంగా ఐదు కోట్ల వరకు రీరిలీజ్ ద్వారా సాదించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా గుంటూరు కారం చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందంట. సినిమాపై చాలా ఊహాగానాలు వినిపిస్తూ ఉండటంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఫస్ట్ సింగిల్ కి బర్త్ డే సర్ప్రైజ్ గా ప్రేక్షకులకి అందించాలని అనుకుంటున్నట్లు టాక్.

తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. అతడు, ఖలేజాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ సారి గత చిత్రాలకి భిన్నమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ తెరకెక్కిస్తున్నారు.