Begin typing your search above and press return to search.

బ్రో బాక్సాఫీస్ కలెక్షన్స్.. 2వ రోజు ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. టికెట్స్ రేట్స్ ఎక్కువగా లేకుండా అలాగే బెనిఫిట్స్ షోల హడావిడి కూడా కనిపించకుండా ఈ సినిమా విడుదలైంది.

By:  Tupaki Desk   |   30 July 2023 6:51 AM GMT
బ్రో బాక్సాఫీస్ కలెక్షన్స్.. 2వ రోజు ఎంతంటే?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. టికెట్స్ రేట్స్ ఎక్కువగా లేకుండా అలాగే బెనిఫిట్స్ షోల హడావిడి కూడా కనిపించకుండా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మొదటి రోజు అయితే సాలిడ్ గానే కనిపించాయి.

ఇక రెండవ రోజు మాత్రం కాస్త కలెక్షన్స్ తగ్గినప్పటికీ కూడా పరవాలేదు అనిపించింది. సముద్రఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇక కంటెంట్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానే దగ్గరవుతోంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు సాధారణ టికెట్ల రేట్ల తోనే మంచి కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు 25 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇక రెండవ రోజు 11 కోట్ల వరకు రాబట్టినట్లుగా తెలుస్తోంది. బ్రో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు రోజుల్లో 35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 55 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు నుంచి దాదాపు మూడున్నర కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే ఈ సినిమా దాదాపు 6 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రో సినిమా దాదాపు 44 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ 72 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద 97.50 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 98.50 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అయితే అందుకోవాల్సి ఉంటుంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ ప్రకారం చూస్తే ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 50 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి బ్రో సినిమా ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.