బోయపాటి నమ్మకం.. ఏదో రకంగా రప్పించడమే లక్ష్యం..
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు!
By: Tupaki Desk | 25 Dec 2025 2:00 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు! అదే జోష్ తో థియేటర్లలోకి రీసెంట్ గా వచ్చిన సినిమా అఖండ 2: తాండవం. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా.. రిలీజ్ అయ్యి రెండు వారాలు పూర్తయిన విషయం తెలిసిందే.
అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 ప్రయాణం మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదనే టాక్ వినిపిస్తోంది. మౌత్ టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం తర్వాత వసూళ్లు క్రమంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. అలా అని సినిమా పని అయిపోయిందని చెప్పలేం. అడ్వాన్స్ బుకింగ్స్ పర్లేదన్న స్థాయిలో కొనసాగుతున్నాయి.
అదే సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ వరకైనా సినిమా నిలబడాలని, ఏదో ఒక విధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా బోయపాటి శ్రీను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో అఖండ 2 గురించి ఇప్పటికే చాలా గొప్ప విషయాలు విన్నానని చిన్న జీయర్ స్వామి పేర్కొనడం చిత్ర బృందానికి మరింత ధైర్యాన్నిచ్చింది. సినిమా టీమ్‌ను అభినందించిన స్వామి వారు, త్వరలోనే సినిమాను తాను స్వయంగా వీక్షించబోతున్నానని, దాని కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
అయితే బోయపాటి సినిమాలకు ఆధ్యాత్మికత, శక్తివంతమైన పాత్రలు, భారీ డైలాగులు ప్రధాన బలంగా నిలుస్తుంటాయి. అఖండ 2లో కూడా అదే మార్క్ కనిపిస్తుందనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. అయితే అంచనాలకు తగ్గట్లుగా కంటెంట్ ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో వసూళ్లపై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయినా సరే పండగల సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న ఆశతో అఖండ 2 మేకర్స్ ప్రమోషన్లపై ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే బోయపాటి ఏదో రకంగా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడమే లక్ష్యంతో పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. చక్కటి టర్నింగ్ పాయింట్ వస్తుందని బోయపాటి ఆశిస్తున్నారేమో!
మొత్తానికి, టాక్ ఎలా ఉన్నా, కలెక్షన్లు తగ్గుతున్నా బోయపాటి శ్రీను మాత్రం తన నమ్మకాన్ని కోల్పోవడం లేదు. చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు, పండగల సీజన్ కలిసి అఖండ–2కి కొత్త ఊపిరి పోస్తాయేమో చూడాలి. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు సినిమా థియేటర్లలో ఎంతవరకు నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
