Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ క్లాష్: దసరా పోటీలో పెద్ద హీరోలే

కల్కి 2898 ఏడీ విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:45 AM GMT
బాక్సాఫీస్ క్లాష్: దసరా పోటీలో పెద్ద హీరోలే
X

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి లాంటి పెద్ద పండక్కి సినిమాల మధ్య పోటీ కామనే. ఇక ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ నడిచిందో మనం చూశాం. ఒకేసారి 4 టాలీవుడ్ స్ట్రయిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ విజేతగా నిలిచింది. మిగతా మూడు చిత్రాలు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నాయి.

ఇక వేసవి కానుకగా ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ దేవర రిలీజ్ అవుద్దని అంతా భావించారు. కానీ ఈ సినిమాను అక్టోబర్ కు వాయిదా వేశారు మేకర్స్. దేవర అనుకున్న తేదీకి విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కానుంది. దీంతోపాటు మే9న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2898 ఏడీ విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో పెద్ద పండుగ దసరాకు బాక్సాఫీస్ వద్ద పోటీ మొదలైంది. దసరా బరిలో ముందుగా రిలీజ్ అవుతున్న సినిమా పవన్ కల్యాణ్ ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

ఈ సినిమా రిలీజైన రెండు వారాలకు ఎన్టీఆర్ దేవర పార్ట్-1 వస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబరు 10వ తేదీన రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ రెండు సినిమాలు మాత్రమే ప్రస్తుతానికి డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే సీనియర్ హీరో బాలకృష్ణ NBK109 మూవీ కూడా దసరా కానుకగా అక్టోబర్ 4 లేదా 11వ తేదీన రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

2023లో దసరాకు భగవంత్ కేసరితో వచ్చి హిట్ కొట్టారు బాలయ్య. అదే సెంటిమెంట్ తో బాబీ తన సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ మూవీ అక్టోబర్ 11వ తేదీని రిలీజ్ డేట్ గా ఖరారు చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంకా బాలయ్య, చైతూ సినిమాల విడుదల తేదీల పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

అయితే దేవర ప్రీ పోన్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. అన్ని వర్క్స్ త్వరగా కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ లో రిలీజ్ కావచ్చని అంటున్నారు. మరి దసరా బరిలో ఉన్న మిగతా మూడు చిత్రాల షూటింగ్స్ సెప్టెంబర్ కల్లా పూర్తి కావు. అయితే ఎలా అయినా దేవరకు సోలో రిలీజ్ డేట్ దక్కనట్లే. మరి దసరా బాక్సాఫీస్ ఫైట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.