Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: గాడ్ ఫాదర్ నెంబర్ దాటుతుందా భోళా?

బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటు వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   7 Aug 2023 12:29 PM GMT
బాక్సాఫీస్: గాడ్ ఫాదర్ నెంబర్ దాటుతుందా భోళా?
X

బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటు వస్తున్నాడు. అది కూడా కమర్షియల్ సినిమాలతోనే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం. ఇక ఇప్పుడు భోళా శంకర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులందరితో కలిసి మెగాస్టార్ చాలా చలాకీగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.

ఇక మొత్తానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు గత ఐదు సినిమాలతో ఎలాంటి రికార్డులను (ఏపీ తెలంగాణ) అందుకున్నాడు అనే వివరాలలోకి వెళితే.. మొదటిరోజు ఏపీ తెలంగాణలో వాల్తేరు వీరయ్య సినిమా 22.90 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది.

ఒక విధంగా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడం వలన కూడా స్థాయిలో ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఇక మలయాళం రీమేక్ వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా మాత్రం మొదటి రోజు 12.97 కోట్లను షేర్ కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. ఒక విధంగా మెగాస్టార్ రీసెంట్ గా అత్యధిక తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఇక అంతకుముందు వచ్చిన ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ అయినప్పటికీ మొదటి రోజు ఊహించని స్థాయిలో మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య సినిమాకు మొదటి రోజు 29.50 కోట్ల రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక సైరా నరసింహా రెడ్డి 38 కోట్లు మొదటి రోజు అందుకోగా ఖైదీ నెంబర్ 150 - 23 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ సాధించింది.

ఇక ఇప్పుడు భోళా శంకర్ సినిమా 20 కోట్ల రేంజ్ లో అయినా షేర్ కలక్షన్స్ అందుకుంటుందా లేదా అనేది కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇది తమిళ వేదళం సినిమాకు రీమేక్. ఇంతకుముందు గాడ్ ఫాదర్ రీమేక్ సినిమా కాబట్టి ఆడియన్స్ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో దానికి 12 కోట్లు షేర్ కలక్షన్స్ మాత్రమే వచ్చాయి. మరి ఇప్పుడు ఈ రీమేక్ ఎలాంటి వసూళ్ళను అందుకుంటుందో చూడాలి.