Begin typing your search above and press return to search.

ఈ వారం బాక్సాఫీస్​ కార్తికేయదే.. అదృష్టం అంటే ఇదే

By:  Tupaki Desk   |   27 Aug 2023 6:00 AM GMT
ఈ వారం బాక్సాఫీస్​ కార్తికేయదే.. అదృష్టం అంటే ఇదే
X

'ఆర్ఎక్స్‌100'తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించి ఘన విజయాన్ని అందుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. కానీ తన తొలి సినిమా రేంజ్​లో ఇప్పటి వరకు హిట్​ను అందుకోలేకపోయారు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండానే వైవిధ్యభరితమైన కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు.

నిజానికి ఆర్స్​ఎక్స్ 100కు ముందు 'ప్రేమతో మీ కార్తిక్​' అని వచ్చిన ఆయన.. ఆర్స్​ఎక్స్ 100 తర్వాత.. హిప్పి, గుణ 369, 90 ఎంఎల్​, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క వంటి చిత్రాలతో అలరించారు. ఈ జర్నీలోనే గ్యాంగ్ లీడర్​, అజిత్​ వాలిమై వంటి చిత్రాల్లో విలన్​గానూ నటించి ఆడియెన్స్​ను అలరించేందుకు ప్రయత్నించారు. కానీ ఏవీ భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఈ క్రమంలోనే ఇప్పుడాయన 'బెదురులంక 2012' అనే మరో విభిన్నమైన కథతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. ఈ చిత్రం రిలీజ్​కు ముందే సాంగ్స్​తో మంచి ఆదరణ దక్కించుకుంది. కానీ ఈ సినిమా అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మంచి టాక్​తో ముందుకెళ్తోంది. వాస్తవానికి ఈ సినిమాకు రిలీజ్​కు పోటీగా వరుణ్ తేజ్​ గాండీవ‌ధారి అర్జున‌, మలయాళ స్టార్ హీరో కింగ్ ఆఫ్ కోతా, కన్నడ సూపర్ హిట్ మూవీ బాయ్స్ హాస్ట‌ల్ వంటి చిత్రాలు రిలీజయ్యాయి. ఈ చిత్రాల పోటీని త‌ట్టుకుని.. బెదురులంక 2012 నిలవడం కష్టమేనని పలువురు భావించారు.

కానీ అంచనాలు తలకిందులు చేస్తూ కార్తికేయ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగానే నెట్టుకొస్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమా కింగ్ ఆఫ్ కోతా, వరుణ్ తేజ్ మూవీ గాండీవ‌ధారి అర్జున మొదటి డీలా టాక్​ను తెచ్చుకున్నాయి. ఇక క‌న్న‌డ అనువాద చిత్రం బాయ్స్ హాస్ట‌ల్ కూడా యావరేజ్​గానే నిలిచింది. ఇతర చిన్న చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు.

దీంతో ఆడియెన్స్​ను కాస్త బెదురులంక 2012నే ఆకర్షిస్తోంది. అయితే ఈ చిత్రం ఏమీ భారీ స్థాయిలో హిట్ కాలేదు కానీ... మిగతా సినిమాలతో పోలీస్తే ఈ వారం బాక్సాఫీస్​ ముందు ఇదే బాగుందనే టాక్​ను తెచ్చుకుంది. సెకండాఫ్‌ కామెడీ బాగానే వ‌ర్కౌట్ అవ్వడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.