ప్రతి నెల తెలుగు, తమిళ్ భాషలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వీటిలో కొన్ని హిట్ అవుతున్నాయి. మరికొన్ని ఏవరేజ్ టాక్ తెచ్చుకోగా, ఇంకొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ అవుతున్నాయి. కంటెంట్ బాగుంటే హీరోతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి. అస్సలు రొటీన్ డ్రామా అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయిన డిజాస్టర్ గా మారుతున్నాయి.
ఈ నెలలో మొదటి వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. అయితే రెండో వారం మాత్రం రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన “జైలర్” మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఆగష్టు 10న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన “భోళా శంకర్” సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
దీని తర్వాత కార్తికేయ హీరోగా తెరకెక్కిన డార్క్ కామెడీ మూవీ “బెదుర్లంక 2012”. క్లాక్ దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ ఆగష్టు 25న రిలీజ్ కాబోతోంది. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన “కింగ్ ఆఫ్ కొత్తా” పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. కంప్లీట్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీతో అభిలాష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనిపై ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మంగళవారం పాన్ ఇండియా లెవల్ లో ఆగష్టు 31న రిలీజ్ కాబోతోంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతోంది. అలాగే నయనతార, జయం రవి జోడీగా నటించిన ఇరైవన్ ఈ నెలలోనే రిలీజ్ అవుతోంది. దాంతో పాటుగా మమ్ముట్టి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కన్నూరు స్క్వాడ్ మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ చిత్రాలలో ప్రేక్షకులని అలరించి సూపర్ సక్సెస్ ని అందుకునే సినిమాలేంటి అనేది వేచి చూడాలి.