బాక్సాఫీస్ వద్ద 'ఆంధ్ర కింగ్ తాలూకా' జోరు.. వీకెండ్ లో ఇక వసూళ్ల జాతర ఖాయం!
బాక్సాఫీస్ దగ్గర నిన్న మొన్నటి వరకు ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి.
By: Tupaki Desk | 29 Nov 2025 1:10 PM ISTబాక్సాఫీస్ దగ్గర నిన్న మొన్నటి వరకు ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. గురువారం రిలీజైన సినిమా పరిస్థితి శుక్రవారం ఎలా ఉంటుందనే చిన్నపాటి టెన్షన్ ట్రేడ్ వర్గాల్లో ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఊహించని విధంగా ఆంధ్ర కింగ్ తాలూకా కలెక్షన్స్ చాలా స్టడీగా ఉండటమే కాకుండా, షో షోకూ పుంజుకుంటున్న తీరు చూస్తుంటే ఇదొక లాంగ్ రన్ రేస్ గుర్రం అని స్పష్టమవుతోంది. ఆడియన్స్ తీర్పు చాలా క్లియర్ గా ఉంది.
సినిమాకు వస్తున్న 'పాజిటివ్ టాక్' ఇప్పుడు బాక్సాఫీస్ కు బూస్ట్ గా మారింది. మౌత్ పబ్లిసిటీ ఎంత బలంగా ఉందో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెల్లగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు పరిస్థితి ఇంకా బెటర్ గా ఉండబోతోందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఓవర్సీస్ లో రామ్ సత్తా ఏంటో ఈ సినిమా నిరూపిస్తోంది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రామ్ కెరీర్ లోనే అక్కడ 'హైయెస్ట్ గ్రాసర్'గా నిలిచే దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. ఒక మాస్ సినిమాకు క్లాస్ ఆడియన్స్ ఉండే అమెరికాలో ఈ రేంజ్ ఆదరణ దక్కడం నిజంగా విశేషం. అక్కడ ప్రీమియర్స్ నుంచి ఇప్పటిదాకా వసూళ్లు నిలకడగా ఉన్నాయి.
ఇక మన దగ్గర లోకల్ మార్కెట్ పరిస్థితి చూస్తే.. ఈరోజు, రేపు వీకెండ్ బుకింగ్స్ అదిరిపోయాయి. శని, ఆదివారాలకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే థియేటర్ల దగ్గర జాతర జరిగేలా ఉంది. చాలా మేజర్ సెంటర్లలో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. స్టడీ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తూ, వీకెండ్ అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకోవడానికి 'ఆంధ్ర కింగ్' రెడీ అయ్యాడు.
రామ్ పోతినేని నటన, కథలోని ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడమే ఈ స్ట్రాంగ్ రన్ కు ప్రధాన కారణం. రొటీన్ మాస్ హంగామా కాకుండా, ఒక జెన్యూన్ కథను చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ఆడియన్స్ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. గురువారం నాడు వచ్చిన ఓపెనింగ్స్ కంటే, ఈ రెండు రోజుల్లో రాబోయే నంబర్స్ ఇంకా పెద్దగా ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాల టాక్.
మొత్తానికి బాక్సాఫీస్ వద్ద రామ్ పట్టు బిగించాడు. ఎలాంటి డ్రాప్స్ లేకుండా కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం సినిమా రేంజ్ ను పెంచేస్తోంది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
