Begin typing your search above and press return to search.

ఈ వారం 9 చిత్రాలు.. ఆ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్​

ఇక ఆగస్టు నెల నెల వంతు మొదలైంది. అయితే ఈ నెల మొదటి వారంలో భారీ సినిమాలు ఏమి లేపు. అన్నీ చిన్న సినిమాలే ఉన్నాయి

By:  Tupaki Desk   |   1 Aug 2023 6:03 AM GMT
ఈ వారం 9 చిత్రాలు.. ఆ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్​
X

జులై నెలలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ను మెప్పించాయి. పవన్‌కల్యాణ్‌ బ్రో ఆ నెల ముగిసింది. ఇక ఆగస్టు నెల నెల వంతు మొదలైంది. అయితే ఈ నెల మొదటి వారంలో భారీ సినిమాలు ఏమి లేపు. అన్నీ చిన్న సినిమాలే ఉన్నాయి. మరి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలేవో చూసేద్దాం..

శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన 'రాజుగారి కోడిపులావ్' ఆగస్టు 4న రిలీజ్ కానుంది. శివ కోన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా రానుంది. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ 'దిల్‌ సే' ఆగస్ట్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ పతాకంపై రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన సినిమా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. ఆగ‌‌‌‌స్టు 4న సినిమా విడుదల కానుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌‌‌‌లో తెర‌‌‌‌కెక్కిన ల‌‌‌‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైన‌‌‌‌ర్ ఇది.

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ నిర్మించిన మొదటి చిత్రం 'ఎల్‌జీఎం' లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌. హరీష్‌ కల్యాణ్‌- ఇవానా జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో రిలీజై మిక్స్​డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆగస్ట్​ 4న తెలుగులో రిలీజ్ కానుంది. రమేష్‌ తమిళమణి తెరకెక్కించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఆడియెన్స్​లో కాస్త ఇంట్రెస్ట్ ఉంది.

జాసన్ స్టాథమ్​, జింగ్​ వు, సీన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం 'మెగ్​ 2.. రాక్షస తిమింగలం' ఆగస్ట్ 3న రిలీజ్​ కానుంది. 2D, 3D తెలుగు, ఇంగ్లీష్, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుంది. దీన్ని బెన్ వీట్లీ తెరకెక్కించారు. బెల్లి అవెరీ, లోరెంజో కలిసి నిర్మించారు. ఇంకా పలు డబ్​ చిత్రాలు కూడా రానున్నాయి. 'బ్లడ్​ అండ్ చాక్లేట్'​, 'హెబ్బులి' వీటిలో ఉన్నాయి.

ఇంకా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సన్​ ఆఫ్ కృష్ణన్'​ ఆగస్ట్​ 4న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రం అప్పట్లో భారీ హిట్​ను అందుకుంది. ఇందులో సూర్య నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం రీరిలీజ్ కానుంది. ఆగస్ట్​ 5న 4కే వెర్షణ్​లో ఆడియెన్స్​ను పలకరించనుంది.