Begin typing your search above and press return to search.

7/G ఫస్ట్ డే బాక్సాఫీస్.. బాగానే రాబట్టింది

ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ 1.05 కోట్ల వరకు సాధించింది.

By:  Tupaki Desk   |   23 Sep 2023 11:51 AM GMT
7/G ఫస్ట్ డే బాక్సాఫీస్.. బాగానే రాబట్టింది
X

రవికృష్ణ, సోనియా అగర్వాల్ లీడ్ రోల్ లో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ 7/G బృందావన్ కాలనీ. ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. టీవీలలో వస్తే ఇప్పటికి ఈ చిత్రాన్ని వీక్షించేవారు ఉన్నారు. అంతగా ప్రేక్షకులకి కనెక్ట్ అయిపొయింది. తాజాగా ఈ మూవీని మరల రీరిలీజ్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.


ఈ నేపథ్యంలోనే ఈ సూపర్ హిట్ మూవీని కూడా నిర్మాత ఏఎంరత్నం ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో 7/G బృందావన్ కాలనీకి సీక్వెల్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో సినిమాపై కొంత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ రావడం విశేషం.

రీరిలీజ్ లో ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలకి మాత్రమే మంచి కలెక్షన్స్ వస్తాయి. అయితే సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ రీరిలీజ్ తర్వాత క్లాసిక్ చిత్రాలైతే వాటిని కూడా ప్రేక్షకులు థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారని అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు 7/G బృందావన్ కాలనీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఒక్క రోజులోనే 90 లక్షల వరకు తెలుగు రాష్ట్రాలలో కలెక్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ 1.05 కోట్ల వరకు సాధించింది. ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ కి ఆడియన్స్ పెద్దగా ఎట్రాక్ట్ కావడం లేదు. అయితే ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కాకపోవడంతో బృందావన్ కాలనీ మూవీ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే డీసెంట్ కలెక్షన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది.

ఈ వీకెండ్ రెండు రోజులు కూడా మూవీని థియేటర్స్ లో కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా ఎంత వరకు ఈ చిత్రం కలెక్షన్స్ సాదిస్తుందనే దాని బట్టి సినిమాకి ఎలాంటి ఆదరణ లభించిందో చెప్పొచ్చు.