Begin typing your search above and press return to search.
రాక్షసులంతా ఏకం అవుతున్నారా?
By: Tupaki Desk | 30 July 2015 5:05 AM GMTఅప్పుడెప్పుడో పురాణాల్లో కనిపించే రాక్షసులు.. డిజిటల్ యుగంలో వచ్చిపడ్డారు. తీవ్రవాదులు.. ఉగ్రవాదులంటూ మానవత్వం మరచి.. హింసే ఆయుధంగా తెగ బడటం.. ఆరాచకంగా వ్యవహరించటం వారికి నిత్యకృత్యమైంది. పవిత్ర యుద్ధం పేరు చెప్పి.. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ.. ఉన్మాదంతో విరుచుకుపడే వారికి చిన్నారులు.. వృద్ధులు.. ఇలాంటి తారతమ్యాలు లేవు.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ తీవ్రవాదులు తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. పాక్ తాలిబన్లు.. ఆప్ఘనిస్థాన్ తాలిబన్లు.. ఇలా తీవ్రవాద గ్రూపులన్నీ ఏకం కావాలని.. అందరూ కలిసి ఉమ్మడిగా భారత్ పై దాడి చేయాలంటూ పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతి ఒకటి అమెరికాలో లభ్యమైనట్లు తాజా సమాచారం.
అమెరికాకు పాఠం నేర్పేందుకు.. ఆ దేశంతో మిత్రపక్షంగా వ్యవహరించే వారిపై దాడి చేయటం ద్వారా అగ్రరాజ్యానికి గుణపాఠం చెప్పాలన్నది వారి వాదన. అంతేకాదు.. తమపై అమెరికా మిత్ర దేశాలా కానీ దాడి చేస్తే.. ప్రపంచంలోని ముస్లింలు అంతా తిరగబడతారని.. అదే అంతిమ పోరాటమవుతుందని హెచ్చరించటం ఆ కథనంలో ఉంది. అయితే.. ఈ కథనాన్ని భారత హోం శాఖ కొట్టిపారేసింది. అలాంటివన్నీ ఊహలే తప్ప ఎప్పటికి నిజం కావని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఇలాంటి ఉగ్ర సంకేతాల విషయంలో మరింత జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.