Begin typing your search above and press return to search.

అట్లాంటాలోని కాలువ కౌశిక్ ని మింగేసింది!

By:  Tupaki Desk   |   30 July 2015 11:19 AM IST
అట్లాంటాలోని కాలువ కౌశిక్ ని మింగేసింది!
X
ఉన్నఉరిని, కన్నవారిని వదిలిపెట్టి ఎన్నో కోరికలతో, మరెన్నో బాధ్యతలతో దేశం విడిచి వెళ్లి ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉధ్యోగంలో చేరాలని తపనపడుతూ విమానం ఎక్కేవారు మనదేశంలో లక్షల మంది ఉన్నారు! అయితే అక్కడ వారి యోగ క్షేమాల విషయంలో ఇక్కడున్న తల్లితండ్రులకు నిత్యం ఆందోళనే కనిపిస్తుంది! ఈ మధ్య కాలంలో దాడుల వల్ల, వ్యక్తిగత ప్రమాదాల వల్ల ఎంతోమంది భారతీయులు విదేశాల్లో మృతిచెందుతున్నారు!

ఇదే క్రమంలో తాజాగా అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతిచెందాడు! ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలెం గ్రామానికి చెందిన కౌశిక్ ప్రస్తుతం అమెరికాలోని అట్లాంటాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు! ఐథే వీకెండ్ సరదాల్లో భాగంగా అట్లాంటా నగరశివారుల్లోని ఒక కాలువలో ఈత కొట్టడానికని వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు!

ఈ విషాదవార్త తెలియడంతో కుటుంబం మొత్తం శోఖసముద్రంలో మునిగిపోయింది! కౌశిక్ తల్లితండ్రులు ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్నారు! అయితే విషయం తెలుసుకున్న అనంతరం తన కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కౌశిక్ తండ్రి కృష్ణ బాబు తెలిపారు! అంతా అనుకున్నట్లు జరిగితే శుక్రవారానికి కౌశిక్ మృతదేహం ఇండియాకు రావచ్చు!