Begin typing your search above and press return to search.
ఎస్కేప్ ఫ్రం మెక్సికో
By: Tupaki Desk | 19 July 2015 5:30 PM GMT దొంగలు, నేరగాళ్లు ఇళ్లకు కన్నాలేయడం తెలిసిందే.. కొందరు జైళ్లకూ కన్నాలు పెట్టి పారిపోయిన ఉదంతాలున్నాయి... కానీ వారం కిందట మెక్సికోలో భారీ బందోబస్తు ఉన్న జైలు నుంచి డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ చాప గుజ్ మాన్ కన్నం కాదు ఏకంగా సొరంగమేసి పారిపోయాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ లోనూ పేరు సంపాదించుకున్న ఈ మాఫియా కింగ్ వేసిన ఎస్కేప్ ప్లాన్ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పక్కాప్లానుతో జైలు నుంచి చెక్కేసిన ఆయన ఇప్పుడు అధికారులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ దిగ్గజ దొంగను పట్టుకోవడానికి 10 వేల మంది పోలీసులు వెతుకుతున్నారు... కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు.
అనుచరుల సహాయంతో జైలుకు కిలోమీటరున్నర దూరం నుంచి సొరంగం తవ్వించి మరీ పారిపోయాడీ డాన్. మెక్సికోలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మాఫియా డాన్ జాయ్ క్విన్ ఇ చాపో గుజ్ మెన్ ను గతంలో పోలీసులు అరెస్టు చేసి మెక్సికో సెంట్రల్ జైలులోని ప్రత్యేక సెల్ లో పెట్టారు. ఈ మెక్సికో జైలుకు కట్టుదిట్టమైన భద్రత ఉంది. అయితే జాయ్ క్విన్ అక్కడి నుంచి పారిపోవడానికి పెద్ద ప్లాను వేసి సక్సెస్ అయ్యాడు.
వారి ప్లాను ప్రకారం జైలుకు కరెక్టుగా కిలోమీటరున్న దూరంలో ఒక ఇల్లు కట్టారు. ఆ ఇంటి లోపల నుంచి జైలు దిశగా సొరంగం తవ్వుకుంటూ వచ్చారు. నేలలో 18 మీటర్ల లోతున అయిదున్నర అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పుతో సొరంగం తవ్వుకంటూ జైల్లో గుజ్ మాన్ ఉన్న గది కిందవరకు తవ్వారు. ఇందుకోసం వారు చాలా టెక్నాలజీని కూడా వాడారు. ఒక మోటారు సైకిలుకు కొన్ని మార్పులు చేసి సొరంగంలోని మట్టిని తరలించేందుకు ఉపయోగించారు. దాదాపు ఏడాది పాటు కష్టపడి దీన్ని తవ్వారు. చివరికి మొన్న జులై 11న ఆయన ఉన్న జైలు గది వరకు తవ్వగా జైలు గదిలోని టాయిలెట్ నుంచి ఆ సొరంగంలోకి రంథ్రం చేసుకుని గుజ్ మాన్ పరారయ్యాడు.
అయితే.. జైలు సిబ్బంది సహకారం లేకుండా ఆయన జైలు గది నుంచి సొరంగంలోకి గుజ్ మాన్ తవ్వే అవకాశం లేదని.. వారికి భారీగా మామూళ్లు ఇచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆయన కోసం మెక్సికోను జల్లెడ పడుతున్నారు. గుజ్ మాన్ ఫొటోలు లక్ష ముద్రించి వాటిని పంచుతూ ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తే చెప్పమని కోరుతోంది. 10 వేల మంది పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. మెక్సికోలో మూలమూలనా వెతుకుతున్నారు. చివరికి మార్చురీల్లోనూ వెతుకుతున్నారు. అయితే... జైలుకే సొరంగమేసిన ఆయన సరిహద్దుల నుంచి పొరుగు దేశం అమెరికాకు సొరంగం తవ్వి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. రోడ్డు మార్గంలోకానీ విమానాల్లో కానీ ఆయన మెక్సికో దాటే అవకాశం లేకపోవడంతో సొరంగ మార్గంలోనే దేశం దాటి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కాగా గుజ్ మాన్ చీకటి వ్యాపారం ఏటా రూ.30 వేల కోట్టకు పైనే ఉంటుంది. అంతేకాదు.. ప్రపంచంలో అత్యంత శక్తిమంతుల్లో ఒకడిగా ఆయన పలుమార్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలోనూ చోటు సంపాదించాడు. తొలిసారి 1993లో అరెస్టైన ఈయన ఇదే జైలులో ఉంటూ 2001లో తప్పించుకున్నాడు. మళ్లీ 2014లో పట్టుబడి ఏడాదిలోనే మెక్సికో ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చాడు. గొప్ప విషయం ఏంటంటే గుజ్ మాన్ ను పట్టుకోలేకపోయిన పోలీసులు సొరంగం తవ్వడానికి ఉపయోగించుకున్న వస్తువులను మాత్రం పట్టుకోగలిగారట. పాపం... దాంతోనే సంతృప్తిపడుతున్నట్లున్నారు.