Begin typing your search above and press return to search.

పాక్ లో బయటపడ్డ నికృష్టపు టేపుల అడ్డా

By:  Tupaki Desk   |   10 Aug 2015 7:06 AM GMT
పాక్ లో బయటపడ్డ నికృష్టపు టేపుల అడ్డా
X
సర్వ దరిద్రాలకు నిలయమై.. ప్రపంచంలోని పలు దేశాల్లో అశాంతికి.. తీవ్రవాదుల కార్యక్రమాలకు అడ్డాగా నిలిచిందన్న పేరున్న పాకిస్థాన్ లో తాజాగా ఒక దారుణమైన రాకెట్ ను అక్కడి అధికారులు గుర్తించారు. అక్కడి బాలల సంరక్షణ శాఖాధికారులు చిన్నారులపై లైంగిక వేధింపులతో రూపొందించిన చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ ను బట్టబయలు చేశారు.

పసితనం ఛాయలు వీడని చిన్నారుల చేత నికృష్ట చేష్టలు చేయిస్తూ.. సభ్య సమాజం తలదించుకునే అనాగరిక సెక్స్ టేపుల్ని తయారు చేస్తున్న రాకెట్ ను బయటపెట్టారు. దాదాపు 280 మందికి పైగా చిన్నారుల సెక్స్ వీడియో టేపుల్ని ఇక్కడ గుర్తించారు. బాధితుల్లో ఆరేళ్ల చిన్నారుల నుంచి 14 ఏళ్ల చిన్నారులు ఉండటం గమనార్హం

ఈ భారీ రాకెట్ ను బయటకు రాకుండా చేసేందుకు పెద్ద తలకాయలు చాలానే ప్రయత్నించినట్లుగా సమాచారం అందుతోంది. మనిషిగా.. సాటి మనిషి మంచి కోరకున్నాఫర్లేదు.. ముక్కపచ్చలారని చిన్నారులతో అకృత్యాలు చేయించే ఈ దుర్మార్గులకు తగిన విధంగా శిక్ష పడేలా అయినా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో లేదో చూడాలి.