Begin typing your search above and press return to search.

ఎంత ప్రేమో; 3 నెలల కోడి పిల్లకు ఆపరేషన్

By:  Tupaki Desk   |   5 Aug 2015 11:49 AM GMT
ఎంత ప్రేమో; 3 నెలల కోడి పిల్లకు ఆపరేషన్
X
కోడి అన్న మాట విన్న వెంటనే దాన్ని ఎప్పుడెప్పుడో కోసుకు తినాలా అని చాలామందికి అనిపిస్తుంది. కానీ.. వాటిని అమితంగా ప్రేమించి.. పెంచుకునే వారు కొందరుంటారు. వాటిని చికెన్ కర్రీగా కాకుండా.. తమలాంటి ప్రాణంగా గుర్తించే వారు కొంతమంది ఉంటారు. కానీ.. మూడు నెలల కోడి పిల్ల కోసం 2500 అమెరికా డాలర్లు (మన రూపాయిల్లో చెప్పాలంటే 1.5లక్షలు) ఖర్చు చేసిన ఉదంతం ఆసక్తి కలిగించక మానదు.

అమెరికాలోని మాసాచుసెట్స్ కు చెందిన అండ్రీ మార్టిన్ అనే ఆవిడకు కోళ్లు అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గరున్న కోళ్లలో సిసెలీ అనే మూడు నెలల కోడి పిల్లకు పుట్టుకతోనే కుడి కాలు లేదు. దీంతో.. అది చాలా ఇబ్బంది పడుతోంది. దాని కష్టం చూడలేని అండ్రీ మార్టిన్.. దానికి కృత్రిమ కాలు పెట్టిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి.. వైద్యుల్ని సంప్రదించింది.

కృత్రిమ కాలు పెట్టేందుకు పెద్ద ఇబ్బంది లేదు కానీ.. అందుకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పినా వెనక్కి తగ్గలేదు. మొత్తంగా రూ.1.5లక్షలు ఖర్చ పెట్టి త్రీడీ కాలు పెట్టటం ద్వారా దానికి కాలు లేని ఇబ్బంది తొలగించొచ్చని చెబితే.. అందుకు ఓకే చెప్పేసి.. బుజ్జి కోడి ఆపరేషన్ కు రెఢీ అవుతోంది మార్టిన్. బుధవారం (ఈరోజే) ఈ శస్త్రచికిత్సను టుఫ్స్ వర్సిటీ కమింగ్స్ స్కూల్ ఆఫ్ వెటర్నటీ మెడిసిన్ లో దీనికి ఆపరేషన్ చేస్తున్నారు. త్రీడీ టెక్నాలజీలో దీనికి కాలు అమరుస్తున్నారు. ఇలాంటి చేయటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఏది ఏమైనా కోడి కాస్త బాగోపోతే కోసుకు తినే వారితో పోలిస్తే.. ఆండ్రీ మార్టిన్ చాలా భిన్నమైంది కదూ.