Begin typing your search above and press return to search.

అర్థశతాబ్ధపు వైరం స్నేహంగా మారింది!

By:  Tupaki Desk   |   22 July 2015 11:19 AM GMT
అర్థశతాబ్ధపు వైరం స్నేహంగా మారింది!
X
సుమారు 54 సంవత్సరాల సుదీర్ఘ వైరం! దశాబధాలుగా కారాలు మిరియాలూ నూరుకున్న రెండు దేశాలు ఉన్నట్లుండి శాంతిమార్గం పట్టాయి! శతృత్వం వద్దు శాంతే ముద్దు అనుకుంటూ కలిసిపోయాయి! దీంతో అర్ధ శతాబధానికిపైగా ఉన్న వైరం కాస్త స్నేహంగా మారిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనడుస్తున్న విషయం ఇదే! అదే అమెరికా - క్యూబాల శాంతి ఒప్పందం!

అది 1959 జనవరి 1... అప్పటివరకూ బాటిస్టా నియంతృత్వ పాలనలో కొట్టిమిట్టాడిన క్యూబా కు తిరుగుబాటు నేత ఫిడెల్ క్యాస్ట్రో అధికార పగ్గాలు చేపట్టిన రోజు. ఆ సమయంలో బాటిస్టా మద్దతుదారులపై మరణశిక్షలను విదించిచారు క్యాస్ట్రో! ఈ మరణశిక్షలను అమెరికా వ్యతిరేకించింది. ఆ క్షణం మొదలు అమెరికా - క్యూబాల మధ్య సంబందాలు పూర్తిగా చెడిపోయాయి! ఇదే సమయంలో 1960 - 61 మధ్యకాలంలో అమెరికాకు చెందిన ఆయిల్ రిఫైనరీలణు క్యూబా జాతీయీకరణం చేయడం, క్యాస్ట్రో ఎప్పుడైతే క్యూబాను సోషలిస్టు దేశంగా ప్రకటించారో ఆ మరుక్షణమే క్యాస్ట్రోను కూలదోసేందుకు అమెరికా కుట్ర చేయడం వంటి కీలక పరిణామాలు జరిగాయి!

అయితే 2014 డిసెంబరు 17న అమెరికా - క్యూబాల మధ్య దౌత్య సంబంధాలు పునరుద్దరిస్థున్నట్లు ప్రస్తుత క్యూబా నాయకుడు రౌల్ క్యాస్ట్రో (ఫిడెల్ క్యాస్ట్రో సోదరుడు) - ఒబామాలు ఒక ప్రకటన చేశారు. దీనికి తొలీడుగుగ్గా... ఉగ్రవాద జాబితా దేశాల నుండి క్యూబా పేరును అమెరికా తొలగించింది. తాజాగా 2015 జూలై 20 తో ఈ రెండు దేశాల మధ్య సంబందాలు పూర్తిగా పునరుద్దరించబడ్డాయి! దీంతో 1961 తర్వాత వాషింగ్టన్ రాయబార కార్యాలయంపై క్యూబా జెండా రెపరెపలాడింది!