Begin typing your search above and press return to search.

దెబ్బకు దెబ్బ; దోమల్ని పుట్టిస్తున్న చైనా

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:15 AM GMT
దెబ్బకు దెబ్బ; దోమల్ని పుట్టిస్తున్న చైనా
X
ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని.. వజ్రంతోనే కోయాలన్న మన సామెతను.. పక్కనున్న చైనావోడు తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. చిరాకు పుట్టించే దోమలకు చెక్ చెప్పటం కోసం.. డెంగ్యూకు కారణమైన దోమల్ని వేటాడేందుకు.. కృత్రిమంగా దోమల్ని సృష్టిస్తున్నారు.

బుల్లి బుల్లి వస్తువుల్ని సింఫుల్ గా చేసేసే చైనావోడు.. దోమల్ని కూడా పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేసేస్తున్నాడు. వణికిస్తున్న డెంగ్యూకు చెక్ చెప్పేందుకు ఉత్తర చైనాలోని గాంగ్ జౌ ప్రాంతంలో ప్రపంచంలోనే అది పెద్ద దోమల ఫ్యాక్టరీని పెట్టేశారు. దీంతో.. ప్రతి వారం పది లక్షల దోమల్ని ఉత్పిత్తి చేస్తున్నారు. ఈ స్టెరిలైజ్డ్ దోమల్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని ఒక క్రమ పద్ధతిలో బయటకు వదులుతారు.

బయటకు వెళ్లిన ఇవి.. డెంగ్యూకు కారణమయ్యే దోమల్ని చంపేస్తాయట. ఈ విధానంలో డెంగ్యూకు కారణమైన దోమల వ్యాప్తిని తగ్గించొచ్చని వారు భావిస్తున్నారు. గత ఏడాదిలో గాంగ్ జౌ ప్రాంతంలో డెంగ్యూ కారణంగా 47 వేల కేసులు నమోదయ్యాయంట. అందుకే.. దోమల్ని దెబ్బ తీయటానికి వాటిపై యుద్ధం చేసే దోమల ఫ్యాక్టీరినీ ఏర్పాటు చేసి మరీ.. వాటిపైకి వదులుతున్నారు. మరి.. ఈ ప్రక్రియ ఎంతవరకూ వర్క్ వుట్ అవుతుందో చూడాలి.