లక్షన్నరకే టాటా నానో 2025: మళ్లీ మిరాకిల్ చేస్తుందా ఈ చిన్నది?
ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం, పార్కింగ్ స్థలం దొరకక ఇబ్బంది పడటం వంటి సమస్యలు నానాటికీ ఎక్కువవుతున్నాయి.
By: Tupaki Desk | 25 July 2025 11:26 AM ISTట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం, పార్కింగ్ స్థలం దొరకక ఇబ్బంది పడటం వంటి సమస్యలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న కార్లకు, ముఖ్యంగా సిటీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టాటా మోటార్స్ చూస్తోంది. 2008లో 'లక్ష రూపాయల కారు'గా సంచలనం సృష్టించిన టాటా నానో, ఇప్పుడు సరికొత్త రూపంలో, అత్యాధునిక ఫీచర్లతో తిరిగి రాబోతోంది. 2025లో భారత రోడ్లపై పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్న ఈ చిన్న కారు, మధ్య తరగతి కలలను మళ్ళీ నిజం చేస్తుందా? అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
దేశంలోని మధ్య తరగతి ప్రజల కలల కారు టాటా నానో మళ్లీ ఒకసారి కొత్త రూపంలో భారత్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2008లో టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ప్రవేశపెట్టిన ఈ చిన్న కారును “రూ.లక్ష కారు”గా గుర్తించారు. ఇప్పుడు 2025లో నానో మళ్లీ పునరాగమనానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈసారి అది కేవలం చవకైన కారు మాత్రమే కాదు, అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్‌తో కూడిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారుతోంది.
వాహన రూపం, డిజైన్ అప్‌డేట్
కొత్త టాటా నానో ఎంతో స్టైలిష్‌గా, ఆధునిక రూపంలో వచ్చేస్తోంది. హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేఅర్లైట్స్ (DRLs), బోల్డ్ అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్లు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చాయి. కేవలం 3.1 మీటర్ల పొడవు, 180 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్తో భారత నగరాల్లో రద్దీ ట్రాఫిక్, చిన్న పార్కింగ్ స్థలాల్లో ఇది సౌకర్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజంగా నగరం కోసమే రూపొందించబడిన కారు అని చెప్పొచ్చు.
-ఇంజిన్, మైలేజ్, ట్రాన్స్‌మిషన్
ఈ కొత్త నానోలో 624 సీసీ ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండబోతోంది. ఇది 38PS పవర్, 51Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమెటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, ఇది లీటరుకు 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదనే అంచనాలు ఉన్నాయి. కంపెనీ భవిష్యత్తులో టర్బో పెట్రోల్, CNG, EV (ఎలక్ట్రిక్ వెర్షన్) లను కూడా తీసుకురావాలని యోచిస్తోంది. ఈవీ మోడల్ సింగిల్ చార్జ్‌పై సుమారు 250 కి.మీ వరకు రేంజ్ ఇవ్వగలదట. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో, ఈ మైలేజ్ నిజంగా బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తుంది.
కొత్త నానోలో ఉండే ప్రధాన ఫీచర్లు:
7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్, యూఎస్‌బీ, ఎయూఎక్స్ సపోర్ట్ , పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, సన్‌రూఫ్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు ఈ ఫీచర్లు చిన్న కారులో కూడా ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. 4 ఎయిర్‌బ్యాగ్స్‌తో టాటా మోటార్స్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇందులో ఉండే భద్రతా ఫీచర్లు:
4 ఎయిర్‌బ్యాగ్స్ , ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రీయర్ పార్కింగ్ సెన్సార్, కెమెరా, స్ట్రాంగ్ స్టీల్ బాడీ, సీట్‌బెల్ట్ రిమైండర్, ESC, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్.. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వినియోగదారులకు పెద్ద ఉపశమనం.
-ధరలు: మళ్లీ మధ్య తరగతికి మనసు దోచే ధరలు
కొత్త టాటా నానో ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.2.80 లక్షల నుండి మొదలవుతుంది. బేసిక్ వేరియంట్లు రూ.1.45 లక్షలకే లభించే అవకాశం ఉంది. ఈవీ వెర్షన్ ధర రూ.5 లక్షల నుండి 7 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఈ ధరలు నిజంగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నాయి. బెంగుళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి ట్రాఫిక్ సమస్యలతో బాధపడే నగరాలకు ఇది పర్ఫెక్ట్ సిటీ కారుగా మారనుంది. మళ్లీ టాటా నానో దేశ మధ్య తరగతి కుటుంబాల కలలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈసారి ఇది కేవలం లక్ష కారు కాదు, లక్షల్లో విలువైన కారు గా పాపులర్ అవ్వడం ఖాయం.
