Begin typing your search above and press return to search.

మారుతి, హ్యుందాయ్‌లకు చెమటలు పట్టించే ఆఫర్! టాటా కార్లపై లక్షల్లో డిస్కౌంట్!

ఇప్పుడు వీరికి గట్టి పోటీనిస్తూ టాటా మోటార్స్ కూడా తమ కార్లపై ఏకంగా రూ.1.35 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

By:  Tupaki Desk   |   9 April 2025 11:00 AM
Tata Motors Discounts
X

మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ నెలలో తమ కార్లపై గరిష్టంగా రూ.1.40 లక్షల వరకు, అలాగే హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.77,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇప్పుడు వీరికి గట్టి పోటీనిస్తూ టాటా మోటార్స్ కూడా తమ కార్లపై ఏకంగా రూ.1.35 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. అన్ని కార్ల కంపెనీలు దాదాపుగా ఏప్రిల్‌లో తమ కార్ల ధరలను పెంచినప్పటికీ, టాటా మోటార్స్ ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం.

టాటా మోటార్స్ తమ కార్లపై గరిష్టంగా రూ.1.35 లక్షల వరకు, కనిష్టంగా రూ. 25,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు (Cash Discount), ఎక్స్ఛేంజ్ బోనస్ (Exchange Bonus), కార్పొరేట్ బోనస్ (Corporate Bonus), స్క్రాపింగ్ బోనస్ (Scrapping Bonus) వంటివి ఉన్నాయి.

ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది?

* Tata Altroz: టాటా Altroz Racer మోడల్‌పై మొత్తం రూ. 1.35 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ.85,000 వరకు నగదు తగ్గింపు, అలాగే ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌గా రూ.50,000 వరకు పొందవచ్చు. ఇక సాధారణ ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్‌లపై గరిష్టంగా రూ.45,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు మార్కెట్‌లో మారుతి బాలెనో, హ్యుందాయ్ ఐ20కి పోటీదారు. దీని ప్రారంభ ధర రూ. 6.65 లక్షలు.

* Tata Harrier, Safari: టాటా పాపులర్ SUVలు హారియర్, సఫారీపై ఈ నెలలో మీరు మొత్తం రూ. 75,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కార్లపై రూ.50,000 వరకు నగదు తగ్గింపు, రూ. 25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లభించనుంది. హారియర్ ప్రారంభ ధర రూ.15 లక్షలు. సఫారీ ప్రారంభ ధర రూ. 15.50 లక్షలు.

* Tata Nexon, Tiago, Tigor: ఈ కార్లపై ఏప్రిల్‌లో మీరు రూ. 45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ. 35,000 నేరుగా నగదు తగ్గింపు. మార్కెట్‌లో స్కోడా కైలాక్, కియా సోనెట్ , మహీంద్రా XUV 3XO వంటి వాటికి ఇది పోటీదారు. టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ. 8 లక్షలు. అలాగే టాటా టియాగో, టాటా టిగోర్‌లపై కూడా మీరు మొత్తం రూ.45,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. టియాగో ప్రారంభ ధర రూ.5 లక్షలు, టిగోర్ ప్రారంభ ధర రూ.6 లక్షలు.

* Tata Curvv: టాటా ఈ కూపే స్టైల్ SUVపై ఏప్రిల్‌లో మీకు రూ. 30,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారు రూ. 10 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీనికి పోటీదారు ఎవరూ లేనప్పటికీ, సిట్రోయెన్ బసాల్ట్ కూడా ఇదే తరహా కూపే స్టైల్ కారు.

* Tata Punch: టాటా ఎంట్రీ లెవెల్ SUV అంటే మైక్రో SUV కారు టాటా పంచ్‌పై ఈ నెలలో మీరు రూ. 25,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారుపై రూ. 10,000 నగదు తగ్గింపు, రూ.15,000 స్క్రాపింగ్ బోనస్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.20 లక్షలు.