Begin typing your search above and press return to search.

సింగిల్ ఛార్జ్‌ తో 440 కి.మీ... ఈ బీఎండబ్ల్యూ కారు స్పెషాలిటీస్ ఇవే!

ఇందులో భాగంగా తాజాగా ఐఎక్స్‌-1 పేరుతో ఫీచర్ రిచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని రిలీజ్ చేసింది. దీంతో బీఎండబ్ల్యూ నుంచి భారత్ లో లాంచ్ అయిన తొలి ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇదే కావడం విశేషం.

By:  Tupaki Desk   |   29 Sep 2023 11:30 PM GMT
సింగిల్  ఛార్జ్‌  తో 440 కి.మీ... ఈ బీఎండబ్ల్యూ కారు స్పెషాలిటీస్  ఇవే!
X

జర్మన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లగ్జరీ కార్లకు పెట్టింది పేరుగా ఉండే కార్ల కంపెనీ అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఐఎక్స్‌-1 పేరుతో ఫీచర్ రిచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని రిలీజ్ చేసింది. దీంతో బీఎండబ్ల్యూ నుంచి భారత్ లో లాంచ్ అయిన తొలి ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇదే కావడం విశేషం.

గతకొంతకాలంగా డీజిల్, పెట్రోల్ కార్ల వాడం తగ్గాలని... వాతావరణాన్ని కలుషితం చేయని ఎలక్ట్రిక్ కార్లను వాడాలని పర్యావరణ వేత్తలు, పలు ప్రభుత్వాలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎక్స్‌-1 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును ఈ కంపెనీ విడుదల చేసింది. ఇదే సమయంలో 2030 నాటికి తమ కార్లను ఎకో ఫ్రెండ్లీగా మార్చాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

దీని ప్రారంభ ధరను రూ.66.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కారు తయారీ కోసం అల్యూమినియంలో 70 శాతం, ప్లాస్టిక్‌ లో 20 శాతం రీయూజ్‌ చేసిందని చెబుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారులో 66.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఈ సమయంలో గంటకు 180 కి.మీ టాప్ స్పీడ్‌ తో దూసుకెళ్తుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌ పై 440 కి.మీ రేంజ్ అందిస్తుంది.

ఇక ఈ కారును ఛార్జ్ చేయడానికి ఏసీ లేదా డీసీ వంటి రెండు రకాల ఛార్జర్లను ఉపయోగించవచ్చు. ఏసీ ఛార్జర్‌ తో 6.3 గంటల్లో లేదా డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ తో 29 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఇదే సమయంలో అనేక సేఫ్టీ, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ కారుతో కంపెనీ ఆఫర్ చేస్తుంది.

వీటిలో అడాప్టివ్ ఎల్.ఈ.డీ హెడ్‌ లైట్లు, 18 అంగుళాల ఎం.అల్లాయ్ వీల్స్, ఇన్ఫోటైన్‌ మెంట్ కోసం 10.7-అంగుళాల బీఎండబ్ల్యూ కర్వ్ డిస్‌ ప్లే, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 10.25 అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ ప్లే ఉన్నాయి. ఇంటీరియర్‌ లో స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 10 స్పీకర్‌ లతో కూడిన హర్మాన్ కార్డాన్ హై ఫై సరౌండ్ సౌండ్ సిస్టం ఉంటుంది.

ఇదే సమయంలో ఈ ఎస్యూవీలోని స్టోరేజ్ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఐఎక్స్‌-1 లో 490 లీటర్ల బూట్ స్పేస్‌ ఉండగా... దీనిని 1,495 లీటర్ల వరకూ పెంచుకోవచ్చు. ఇదే క్రమంలో భద్రత విషయానికి వస్తే ఈ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌, బ్రేక్ అసిస్ట్‌ తో కూడిన ఏబీఎస్, కార్నరింగ్ బ్రేకింగ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, క్రాష్ సెన్సార్లతో మెరుగైన భద్రతను పొందవచ్చు.