Begin typing your search above and press return to search.

భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు... ప్రత్యేకతలివే!

ఈ మేరకు "బీఎండబ్ల్యూ ఐ ఎక్స్ 1" పేరిట పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని ఇండియాలో విడుదల చేయనున్నట్లు జర్మన్ ఆటో దిగ్గజ సంస్థ ట్విట్టర్ లో పోస్టు చేసింది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 1:30 AM GMT
భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్  కారు... ప్రత్యేకతలివే!
X

జర్మన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లగ్జరీ కార్లకు పెట్టింది పేరుగా ఈ కార్లు ఉంటాయి. బీఎండబ్ల్యూ కార్లు స్టేటస్ సింబల్ అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో తాజాగా మొట్టమొదటి సారి పూర్తి ఎలక్ట్రిక్ కారు భారత్ మార్కెట్ లోకి రానుంది.

అవును... మొట్టమొదటి సారి పూర్తి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ లోకి తీసుకురానుంది బీఎండబ్ల్యూ. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన ఈ పూర్తి ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది. ఈ మేరకు "బీఎండబ్ల్యూ ఐ ఎక్స్ 1" పేరిట పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని ఇండియాలో విడుదల చేయనున్నట్లు జర్మన్ ఆటో దిగ్గజ సంస్థ ట్విట్టర్ లో పోస్టు చేసింది.

ప్రత్యేకతలు ఇవే:

బీఎండబ్ల్యూ ఐ ఎక్స్ 1 కారు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ 313 హెచ్.పీ తో ఉంటుంది. ఇదే సమయంలో ఈ కారు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక బ్యాటరీ ప్యాక్ 64.7 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ యూనిట్‌ గా ఉండటంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 438 కిలోమీటర్ల దూరం నడవనుంది.

ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు టచ్ ఫంక్షన్‌ తో 10.7 అంగుళాల క్వార్డ్జ్ స్క్రీన్‌ తో డామినేట్ చేసిన డాష్‌ బోర్డ్ ను అందించారు. ఇదే సమయంలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌ లెస్ ఛార్జింగ్, వాయిస్ కంట్రోల్ మొదలైన సౌకర్యాలు ఈ కారులో ఉన్నాయి.

ఇక ఫైనల్ గా ఈ ఎలక్ట్రికల్ కారు ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.70 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.