Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అద్దెబైకుల స్ట్రీట్!

By:  Tupaki Desk   |   18 July 2015 4:57 AM GMT
హైదరాబాద్ లో అద్దెబైకుల స్ట్రీట్!
X
కొనుక్కుంటే ఒకటే బైక్... అదే అద్దెకు తీసుకుని తిప్పుకుంటే అరవైఆరు.. కాదు ఎన్నో బైకులు! ఏదైనా ఒకబైక్ బాగుంది అని కొన్న నెలతిరిగే లోపు దాన్ని తలదన్నే సూపర్ బైక్ మరొకటి మార్కెట్ లో ప్రత్యక్షం అవుతుంది. ఎంత సంపాదన ఉన్న వాళ్లకైనా... మరీ నెల నెలకీ ఒక కొత్త బైక్ అంటే చాలా కష్టమే! కానీ... బైకులపై మోజు కుర్రకారు మనసును మనసులో ఉంచడం లేదు! ఇది ఒక రకమైన వ్యసనం అనుకోవచ్చు. ఈ కుర్రకారు అవసరాన్ని, ఆలోచననూ గుర్తించిన ఢిల్లీకి చెందిన మోక్షా శ్రీవాస్తవ... స్కూటర్స్ నుండి సూపర్ సూపర్ బైక్స్ వరకూ అద్దెకిచ్చే ఒక "వీల్ స్ట్రీట్" ని ప్రారంభించారు! త్వరలోనే ఈ స్ట్రీట్ ని హైదరాబాద్ లో కూడా ఏర్పాటుచేయనున్నారట! దినదినాభివృద్ది చెందుతున్న ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం!!

వాట్సప్, ఎస్.ఎం.ఎస్. లద్వారా ఆన్ లైన్ లో ఈ వీల్ స్ట్రీట్ సేవలు పొందవచ్చు. సుమారు 1700కు పైగా రకరకాల టూవీలర్ బైక్ లు లేటెస్ట్ మోడల్స్ ఈ స్ట్రీట్ లో ఉంటాయి. ఇక్కడ బైక్ లను రోజువారీలెక్కల్లో ఉంటుంది. వీళ్లవద్ద ఉన్న బైకుల అద్దె రోజుకు రూ.300 నుండి రూ.10000 వరకూ ఉందంటే... ఎన్ని రకాలా వేరియేషన్స్ ఉన్న బైకులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు!

దీనికోసం ప్రత్యేకంగా వారం ముందో, 10 రోజుల ముందో పోనీ రెండు మూడు రోజుల ముందో బుక్ చేసుకోనవసరం లేదు. కేవలం 1 గంట ముందు బుక్ చేసుకుంటే... మరు నిమిషం మీరు కోరుకున్న బైక్ మీ చేతుల్లో ఉంటుంది. అడ్వాన్స్ రూ.1000 నుండి రూ.25000 వరకూ ఉంటుంది!

ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే ఉన్న ఈ వీల్ స్ట్రీట్... త్వరలో హైదరాబాద్ లో కూడా ప్రారంభం కాబోతుంది! హైదరాబాద్ కుర్రాళ్లు మరొ కొన్ని రోజులు ఆగితేచాలు... సూపర్ డూపర్ బైక్స్ పై రయ్ రయ్ మని దూసుకుపోవచ్చు!