Begin typing your search above and press return to search.

వోల్వో XC90..నయా వెర్షన్ పసిపాపలకు అంకితం..!

By:  Tupaki Desk   |   15 July 2015 4:00 AM GMT
వోల్వో XC90..నయా వెర్షన్ పసిపాపలకు అంకితం..!
X
పసిపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆకట్టుకొనే మోడల్ ఇది. వోల్వో కంపెనీ XC90 SUV మోడల్ నయా వెర్షన్ లో చిన్నారులకు పెద్ద ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ సెవెన్ సీటర్ వెహికల్ లో ఒక ప్యాసింజర్ సీటునే త్యాగం చేసి.. చిన్నారులను కూర్చోబెట్టడానికి చక్కటి ఏర్పాట్లు చేసింది. ఆశ్చర్యపోయేలా.. అదిరిపోయేలా ఉన్న ఈ మార్పులతో వోల్వో కంపెనీ అందరినీ ఆకట్టుకొంటోంది. పసిపిల్లలను కారులో దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు.. వారిని అత్యంత సేఫ్టీగా... సెట్ చేసేఏర్పాట్లు ఉన్నాయి ఇందులో. ఎక్సెలెన్స్ ఎడిషన్ ఫోటోలతో ఆ ఏర్పాట్లను కళ్లకు కట్టింది.

ఇలాంటి ఏర్పాట్లు కొంత విచిత్రంగానే అనిపించినా.. చిన్నారులతో దూర ప్రయాణాలు చేసే వారికి మాత్రం ఇందులోని సౌకర్యం అర్థం అవుతుంది. సౌకర్యవంతంగా ఉన్న సీట్ లో బెల్ట్ లను పెట్టేసి.. వారిని స్వేచ్ఛగా వదిలేయవచ్చు. అంతేగాక తల్లి తండ్రి లేదా..వారి సంరక్షణ చూసే వారెవరైనా బేబీకి ఎదురుగానే కూర్చోవచ్చు. వోల్వో కంపెనీ ఎంతో శాస్త్రీయంగా.. ఎన్నో పరిశోధనలు చేసే ఈ సీటింగ్ అరేంజ్ మెంట్ చేసింది. కారు ప్రయాణం ఉండే బడలికలు ఏమిటో పెద్దవాళ్లకు సులభంగానే అర్థం అవుతుంది. మరి పసి వాళ్ల పరిస్థితి ఏమిటి? ఐదారు నెలల వయసు చిన్నారుల దగ్గర నుంచి మూడు నాలుగేళ్ల వయసు వారికి కారు సీటింగ్ అరేంజ్ మెంట్ ఏ మాత్రం అనువుగా ఉండకపోవచ్చు. ఇలాంటి నేపథ్యం ఈ ఎక్సెలెన్స్ వెర్షన్ లోని అరేంజ్ మెంట్ పిల్లలకు కొత్త సౌకర్యంలా కనిపిస్తోంది.

శాస్త్రీయతతోనే కాకుండా.. ప్రయోగాత్మకంగా కూడా ఈ వెర్షన్ పై ప్రయోగాలు చేస్తోంది వోల్వో. కొన్ని రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ లను కూడా పరిగణనలోకి తీసుకొని 2017 లో ఈ వెర్షన్ ను మార్కెట్ లోకి తీసుకురావాలని భావిస్తోంది.