Begin typing your search above and press return to search.

డీజిల్ అల్టో; లీటరుకు 30 కి.మీ. ప్లస్

By:  Tupaki Desk   |   3 Aug 2015 7:31 AM GMT
డీజిల్ అల్టో; లీటరుకు 30 కి.మీ. ప్లస్
X
కారు కలను పెద్ద ఎత్తున నిజం చేసే వేరియంట్ గా గుర్తింపు పొందిన మారుతి సుజుకి ఆల్టో కారు మరో సంచలనానికి తెర తీయనుందా? అంటే.. అవుననే చెబుతున్నారు. దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే బుల్లికారును తయారు చేయాలన్న లక్ష్యంతో ఉన్న మారుతి.. తన అల్టో వేరియంట్ తో ఆ అద్భుతాన్ని సాధించాలని భావిస్తోంది.

ఇందుకోసం అల్టో డీజిల్ కారును మార్కెట్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అన్నీ బాగుంటే.. ఈ ఏడాది చివరి నాటికి మారుతి అల్టో డీజిల్ వేరియంట్ వచ్చేస్తుందని చెబుతున్నారు. గత జూన్ లో విడుదల చేసి మారుతి వారి సెలేరియో మోడల్ లో వినియోగించి 793 ట్విన్ సిలిండర్ ఇంజిన్ ను వినియోగించాలని మారుతి భావిస్తున్నట్లు చెబుతున్నారు. సిలేరియో లీటరుకు 27.62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సెలేరియోతో పోలిస్తే.. అల్టో ఎంతో బుజ్జిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అల్టో డీజిల్ వేరియంట్ మైలేజీ లీటరకు 30 ప్లస్ ఉండేలా మారుతి డిజైన్ చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ అంచనా కానీ నిజమైతే.. బుల్లి కార్లలో అల్టో మరో సంచలనంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. మరి.. మారుతి నుంచి డీజిల్ అల్టోకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..?