Begin typing your search above and press return to search.

కార్ల కంపెనీల్లో కొనుగోలు జోష్

By:  Tupaki Desk   |   8 Jun 2015 10:12 AM GMT
కార్ల కంపెనీల్లో కొనుగోలు జోష్
X
2015 ఆర్థిక సంవత్సరం కార్ల తయారీ కంపెనీల్లో జోష్ నింపింది. రెండేళ్ల వరుస నష్టాల తర్వాత కార్ల అమ్మకంలో ఆ ఏడాదిలో జోరు పుంజుకున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) విడుదల చేసిన నివేదికలో తేలింది. పెట్రో ధరలు తగ్గిన నేపథ్యంలో కార్లు కొనేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనపరిచినట్లు నివేదిక ప్రకటించింది. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థ చక్కబడి బలోపేతం కావడం అనే పరిస్థితులు కూడా దోహదం చేసాయని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ చెప్పారు.

ఇదే సమయంలో విదేశాలకు చేసే కార్ల ఎగుమతుల సంఖ్య తగ్గిపోవడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1.66 శాతం తగ్గిపోయింది అయితే అన్నిరకాల ఎగుమతుల కేటగిరి మాత్రం మెగుపుడింది.

2012-13 ఆర్థిక సంవత్సరంలో 6.69 అమ్మకాల తగ్గుదల , 2013-14 ఏడాదిలో 4.65 తగ్గుదలను నమోదుచేసుకున్న కార్ల అమ్మకాలు 2015 ఆర్థిక సంవత్సరం అమ్మకాల సంఖ్యత తేల్చేసరికి పెద్ద ఎత్తున జోష్ కనిపించింది. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆనందం కనపిస్తోంది. మరోవైపు 2014-15 ఆర్థిక సంవత్సరంలో బైక్ ల కేటగిరిలో తగ్గుదల కనిపించింది. కేవలం 2.5 వృద్ధి మాత్రమే కనిపించింది. అయితే స్కూటర్ల విక్రయాలు ఏకంగా 25.06 పెరిగాయి.
అదే సమయంలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వాహన విక్రయాలు కూడా 2.83 శాతం క్షీణతను నమోదు చేసుకొని సేల్స్ పడిపోయాయి. కర్ణాటకతో పాటు పలు రాష్ర్టాల్లో మైనింగ్ పై విధించిన నిషేధం ఎత్తివేయడంతో ట్రక్కుల అమ్మకంలో జోష్ కనిపించింది.