Begin typing your search above and press return to search.

స్టార్ల‌కు చుక్క‌లే.. బావుంద‌య్యా సామీ నీ జాత‌కం..!

మొత్తానికి వేణుస్వామిని న‌మ్మితే చాలు గ్ర‌హాల‌న్నీ అనుకూలంగా మార‌తాయ‌ని ప్రూవ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:10 PM GMT
స్టార్ల‌కు చుక్క‌లే.. బావుంద‌య్యా సామీ నీ జాత‌కం..!
X

సినీవినీలాకాశంలో ఎవ‌రి జాత‌కం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఊహించ‌లేం. చాలా మంది తార‌లు ఇలా వ‌చ్చి అలా వెళుతుంటారు. కొంద‌రు సైలెంట్ గా వ‌చ్చి అనూహ్యంగా ఓ వెలుగు వెలిగిన‌వారు ఉన్నారు. రష్మిక మంద‌న అలాంటి క‌థానాయికే.. అయితే ర‌ష్మిక‌ కెరీర్ ఆరంభ‌మే వేణుస్వామి లాంటి జ్యోతిష్కుని క‌లిసింది. ఆయ‌న జోశ్యం ఫ‌లించి పెద్ద స్టార్ అయింది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా పేరొచ్చింది. స్టార్ గా వెలుగుతున్న క్ర‌మంలోనే పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా హిందీలో క్రేజీ ఆఫ‌ర్లు అందుకుంటోంది. వ‌రుస చిత్రాల్లో న‌టించేస్తోంది.

దీంతో ర‌ష్మిక ఫార్ములా వ‌ర్క‌వుటైంద‌ని భావించిన చాలామంది సినీ సెల‌బ్రిటీలు వేణు స్వామిని క‌ల‌వ‌డం త‌మ రాత ఎలా ఉందో క‌నుక్కోవడం ప్రారంభించారు. ర‌ష్మిక విష‌యంలో వేణు స్వామి ఏదో పాజిటివ్ గా మంచి మాట చెప్పాడ‌ని భావించి లైట్ తీస్కున్నా.. ఆ త‌ర్వాత దానికి కాంట్రాస్టుగా స‌మంత‌- నాగ‌చైత‌న్య జంట కాపురం ఎంతో కాలం నిల‌వ‌ద‌ని ఢంకా భ‌జాయించి చెప్పారు వేణుస్వామి. గ్ర‌హ‌బ‌లం స్థాన‌బ‌లం జ్యోతిష్యం అంటూ ఆయ‌న చెప్పిన‌దే నిజం అయింది. ఆ జంట వేణుస్వామి చెప్పిన‌ట్టుగానే విడాకులు తీసుకోవ‌డం ప్ర‌పంచానికి షాకిచ్చింది. నెగెటివ్ విష‌యం మాట్లాడినా అది నిజ‌మైంది కాబ‌ట్టి వేణు స్వామి రియ‌ల్ హీరో అయ్యాడు.

ఆ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ కూడా వేణుస్వామి వ‌ద్ద త‌న గోడును వెల్ల‌బోసుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ తో విజ‌యం వ‌రించినా అది త‌న‌కు అనుకూలంగా మార‌లేదు. ఆ క్ష‌ణం నిధి గ్ర‌హ‌స్థితి రీత్యా ఇత‌ర ఉప‌శాంతుల కోసం ప్ర‌య‌త్నించింద‌ని ప్ర‌చార‌మైంది. ఏదేమైనా వేణుస్వామిని క‌లిసాక 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' (ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరో) లాంటి క్రేజీ ఆఫ‌ర్ అందుకున్నా కానీ ఆ సినిమా ప‌డి లేస్తూ ఎప్పుడు రిలీజ‌వుతుందో కూడా క్లారిటీ లేకుండా పోయింది. దీంతో వేణుస్వామి జాత‌కం ఫ‌లించ‌లేదా? అంటూ నెటిజ‌నుల్లో కామెంట్లు వినిపించాయి. కానీ ఇంత‌లోనే అన్ని కామెంట్ల‌కు చెక్ పెడుతూ ప్ర‌భాస్ స‌ర‌స‌న మారుతి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశం నిధి అందుకుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

మొత్తానికి వేణుస్వామిని న‌మ్మితే చాలు గ్ర‌హాల‌న్నీ అనుకూలంగా మార‌తాయ‌ని ప్రూవ్ అవుతోంది. కాస్త అటూ ఇటూగా పాజిటివ్ రిజ‌ల్ట్ ద‌క్కుతోంది. దీనివ‌ల్ల ఇప్పుడు గ‌ప్ చుప్ గా తెలుగు సినీ క‌ళామ‌త‌ల్లిని న‌మ్ముకున్న చాలా మంది త‌మ అదృష్టం గురించి భ‌విష్య‌త్ గురించి స్వామి వ‌ద్ద‌ తెలుసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు తెలిసింది. సినీన‌టులు రాజ‌కీయ నాయ‌కుల్లో వేణుస్వామి జ్యోతిష్యం అంటే బోలెడంత క్రేజ్ నెల‌కొంది.