Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మూడ‌వ పెళ్లిపై వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

జ్యోతిష్యుడు వేణుస్వామి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. సెల‌బ్రిటీల జాత‌కాల‌తో ఇండ‌స్ట్రీలో ఫేమ‌స్ అయిన జ్యోతిష్యుడు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 11:58 AM GMT
ప‌వ‌న్ మూడ‌వ పెళ్లిపై వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

జ్యోతిష్యుడు వేణుస్వామి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. సెల‌బ్రిటీల జాత‌కాల‌తో ఇండ‌స్ట్రీలో ఫేమ‌స్ అయిన జ్యోతిష్యుడు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లువురు హీరోయిన్లకు జాత‌కాలు చెప్ప‌డం..ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం జ‌రిగింది. వాటిలో కొన్ని ఆయ‌న చెప్పిన‌ట్లు జ‌ర‌గ‌డం..మ‌రికొన్ని జ‌ర‌గ‌డ‌క‌పోవ‌డం రెండూ ర‌కాలుగానే ఉంది. అలాగే రాజకీయాల ప‌రంగానూ ఆయ‌న ప‌లువురు నేత‌ల‌కు సంబంధించి జ్యోతిషం చెప్ప‌టం జ‌రిగింది.

అందులోనూ ఆయ‌న చెప్పిన వాటిలో కొన్ని జ‌రిగాయి..మరికొన్ని జ‌ర‌గ‌లేదు. తాజాగా జ‌న‌నేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌విష్య‌త్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2024లో మ‌ళ్లీ విడాకులు తీసుకుంటార‌ని అన్నారు. సినిమాల ప‌రంగా మంచి జీవితం ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ‌..వ్య‌క్తిగ‌త జీవితాల్లో ఆటు పోట్లు ఎదుర్కుంటార‌న్నారు. అన‌వ‌స‌రంగా రాజ‌కీయాలు చేసి సినిమా భ‌విష్య‌త్ ని నాశ‌నం చేసుకుంటున్నార‌న్నారు.

ప‌వ‌న్ కేవ‌లం ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మాట త‌ప్ప ఇంకెవ‌రి మాట విన‌ర‌న్నారు. త్రివిక్ర‌మ్ కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్లో జోక్యం చేసుకోర‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక‌నైనా మేల్కోవాల‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎంగా చూడాల‌నుకుంటున్న వారిలో తాను ఉన్నాన‌న్నారు. ఈ విష‌యాలు అర్దం చేసుకోకుండా ప‌వ‌న్ అభిమానులు త‌న‌ని ట్రోల్ చేస్తున్నార‌ని....అయినా స‌రే తానేం భ‌య‌ప‌డ‌న‌న‌ని...ట్రోల్ చేసినా ప‌ట్టించుకోన‌ని అన్నారు.

మొత్తానికి మ‌రోసారి వేణుస్వామి ప‌వ‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న పై అభిమానుల ట్రోలింగ్ అన్న‌ది ష‌రా మాములుగా కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో షూటింగ్ ల‌కు కూడా బ్రేక్ ఇచ్చేసారు.