Begin typing your search above and press return to search.

2023 చివరి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.. అదేంటో తెలుసా?

వాటి సంఖ్యలను గమనించి దాని వల్ల మనకు లభించే వాటిని పరిశీలిస్తుంటాం.

By:  Tupaki Desk   |   28 Dec 2023 12:30 AM GMT
2023 చివరి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.. అదేంటో తెలుసా?
X

సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి. ఒక్కో సంవత్సరానికి ఒక్కో ప్రత్యేకత సూచిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం దాని ప్రాముఖ్యత తెలిస్తే ఆశ్చర్యపోతుంటాం. ఇలా మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వచ్చి వెళ్లడం మామూలే. ప్రతి సంవత్సరం ఏదో ఒక అనుభూతిని కలిగించడం సహజమే. ఈనేపథ్యంలో సంవత్సరాల గురించి మాట్లాడుకోవడం కామన్. వాటి సంఖ్యలను గమనించి దాని వల్ల మనకు లభించే వాటిని పరిశీలిస్తుంటాం.

2023కు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం చివరి తేదీ 31/12/2023ని గమనిస్తే 123123 అని సూచిస్తుంది. ఈ నంబర్ చూడగానే ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఈక్రమంలో ఇది దేవతల సంఖ్యగా చెబుతుంటారు. ఇవి దివి నుంచి భువికి పంపినట్లుగా భావిస్తుంటారు. అందుకే ఈ సంఖ్య ఎంతో విశిష్టమైనదిగా గుర్తిస్తున్నారు.

123లో ప్రతి సంఖ్యకు ఎంతో అర్థం ఉంటుందని చెబుతారు. నెంబర్ వన్ ఎప్పుడు కొత్త అర్థాన్ని సూచిస్తుంది. కొత్త ప్రారంభానికి సంకేతంగా నిలుస్తుంది. నెంబర్ 2 భావోద్వేగం, ఆనందాల గురించి తెలియజేస్తుంది. నెంబర్ 3 నేర్చుకోవడానికి ఎదుగుదల గురించి విశదీకరిస్తుంది. ఇలా 123 మనకు చాలా విషయాలు వివరిస్తున్నాయి. 123ని 1+2+3 గా చూస్తే వీటి సమానం 6 అవుతుంది. ఇది కూడా సమతుల్యత, ప్రేమలకు నిదర్శనంగా నిలుస్తుంది.

2023 సంవత్సరం నుంచి 2024 సంవత్సరానికి మారుతున్న నేపథ్యంలో రెండు సంవత్సరాలకు కూడా మంచి సంబంధం ఏర్పడింది. 2023 సత్యం, 2024 శక్తి, ప్రకాశాన్ని తెలియజేస్తుందని న్యూమరాలజీ ప్రకారం తెలుస్తోంది. దీంతో ఈ తేదీకి ప్రాధాన్యం కలుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గ మారుతున్నాయి.

కొత్త ఒక వింత పాత ఒక రోతగా అన్నట్లు ఎప్పుడు కూడా గడిచిపోయే స్వాగతించే తేదీలు మనకు మధుర జ్ణాపకాలు మిగల్చడం మామూలే. ఇందులో భాగంగానే 311223 తేదీలో మనకు కలిసొచ్చే అంశాలు ఉన్నాయని నమ్ముతున్నారు. దీని కోసమే సామాజిక మాధ్యమాల్లో వీటి గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి రోజు అందరి మదిలో నిలవడం ఖాయం.