Begin typing your search above and press return to search.

ఇనస్టా రీల్స్‌ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య!

మొదటి భార్య ఇనస్ట్రాగామ్‌ రీల్స్‌ చూస్తున్నాడంటూ.. భర్త మర్మాంగాలను రెండో భార్య బ్లేడ్‌ తో గాయపరిచింది.

By:  Tupaki Desk   |   22 July 2023 10:09 AM GMT
ఇనస్టా రీల్స్‌ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య!
X

ఇప్పటివరకు భార్యలపైనే దాడి చేసే భర్తలనే చూశాం. ఇప్పుడు భర్తలపైనే దాడులకు దిగుతున్న భార్యల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో భర్తలనే ప్రియుళ్లతో కలిసి భార్యలు హత్య చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. ఇప్పుడు ఇదే కోవలో ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగింది కాదు.

తన భర్త.. మొదటి భార్యకు చెందిన ఇనస్టాగ్రామ్‌ రీల్స్‌ చూస్తున్నాడని రెండో భార్య దారుణానికి తెగించింది. బ్లేడ్‌ పెట్టి భర్త మర్మాంగాలపై దాడి చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఈ దారుణం జరిగింది. మొదటి భార్య ఇనస్ట్రాగామ్‌ రీల్స్‌ చూస్తున్నాడంటూ.. భర్త మర్మాంగాలను రెండో భార్య బ్లేడ్‌ తో గాయపరిచింది.

ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్‌ బాబు.. మొదటి పెళ్లి చేసుకుని భార్యతో విభేదాలతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట వరమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఈ క్రమంలో ఆనంద్‌.. తన మొదటి భార్య వీడియోలను ఇనస్టాగ్రామ్‌ లో చూస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అతడి రెండో భార్య వరమ్మ గమనించింది. ఈ క్రమంలో మొదటి భార్యతో విడాకులు తీసుకుని.. ఇంకా ఆమె ఇనస్టాగ్రామ్‌ వీడియోలు ఎందుకు చూస్తున్నావని రెండో భార్య వరమ్మ ప్రశ్నించింది.

దీంతో భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన వరమ్మ.. భర్త ఆనంద్‌బాబు మర్మాంగాలపై బ్లేడ్‌ తో దాడి చేసింది.

ఈ దాడిలో ఆనంద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆనంద్‌ బాబును విజయవాడకు తరలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై తన రెండో భార్య వరమ్మ బ్లేడ్‌ తో దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.