జనసేన అంచనాలు.. ప్రజలకు చేరువయ్యాయా ..!
సహజంగానే ఏడాది పాలన తర్వాత.. నాయకులు.. ప్రజా ప్రతినిధుల పనితీరుపై ఒక అంచనా వస్తుంది.
By: Tupaki Desk | 11 Jun 2025 1:00 AM ISTసహజంగానే ఏడాది పాలన తర్వాత.. నాయకులు.. ప్రజా ప్రతినిధుల పనితీరుపై ఒక అంచనా వస్తుంది. ఎవరు కాదని అన్నా.. ఏడాది పాలన కేవలం హనీమూన్ పిరియడ్ అని భావించినా.. ప్రజల దృష్టిలో ఏడా ది అంటే.. చాలా ఎక్కువే. దీంతో ఇప్పుడు కూటమి పార్టీల్లోని నాయకుల పనితీరుపై ప్రజల అంచనాలు ఎలా ఉన్నాయన్నది ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. మరీ ముఖ్యంగా టీడీపీ, బీజేపీ నాయకుల పనితీరు ఎలా ఉన్నా.. జనసేన కీలకంగా మారింది.
దీనికి 3 కారణాలు ఉన్నాయి.
1) జనసేన అధినేత పవన్‌పై ప్రజలకు పెరిగిన అపారమైన నమ్మకం. ఎన్ని కలకు రెండేళ్ల ముందు నుంచి పవన్ ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీపాలనను తిడుతూ.. ఆయన మెరుగైన పాలన అందిస్తామని.. అభివృద్ధి అంటే ఏమిటో.. ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పాలనలో మెరుపులు మెరిపిస్తామని కూడా చెప్పారు. అసలు అభివృద్ధికి కేరాఫ్ గా ఏపీని మారుస్తామని కూడా చెప్పారు. (గత వీడియోలు చూస్తే తెలుస్తుంది)
2) అవినీతి, బంధు ప్రీతి లేని రాజకీయాలు చూస్తారని కూడా పవన్ చెప్పారు. దీనిపైనా ప్రజనల్లో అంచనా లు పెరిగాయి. ఎందుకంటే.. అప్పటి వరకు అనేక రూపాల్లో వైసీపీ నాయకులు ఇబ్బందులు పెట్టారని.. దోచుకున్నారన్న ప్రచారం పెద్దగా ఉండడమే దీనికి కారణం. ఇక,
3) మహిళలకు భద్రత కల్పిస్తామని పవన్ చెప్పారు. దీనిపై కూడా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు భరోసా పెరిగింది. కట్ చేస్తే.. ఏడాది కాలంలో జనసేనపై ఇంతగా ఉన్న అంచనాలు ఫలించాయా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. వ్యవస్థీకృతంగా ఉన్న వ్యక్తులను .. రాజకీయ లాలస, అవినీతి వంటివాటిని అదుపు చేయడం అంత తేలిక కాదు. ఈ క్రమంలో కొత్తతరం నాయకుడిగా.. కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చిన పవన్‌ను ప్రజలు స్వాగతించారు. దీంతోనే జనసేనపై అనేక అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ ఏడాది కాలంలో భారీ ఎత్తున అంచనాలు సాధించడంలో పార్టీ కొంత మేరకు సాధించినా.. మరిన్ని సాధించాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులపైనా మహిళలపైనా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి.. జనసేన మరింత కృషి చేయాల్సిన అవసరం.. అంచనాలు చేరుకునేందుకు శ్రమించాల్సిన అవసరం రెండూ ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.