Begin typing your search above and press return to search.

ఇద్దరు జులాయి ఫ్రెండ్స్ మధ్య గొడవ.. మరీ ఇంత దారుణమా?

అయితే.. ఆ విషయాల్ని మనసులో పెట్టుకొని దారుణంగా హింసకు గురి చేసిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వైరల్ గా మారిన వీడియోను చూసిన వారంతా షాక్ తింటున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2023 5:28 AM GMT
ఇద్దరు జులాయి ఫ్రెండ్స్ మధ్య గొడవ.. మరీ ఇంత దారుణమా?
X

స్నేహితుల మధ్య మనస్పర్థలు మామూలే. అయితే.. ఆ విషయాల్ని మనసులో పెట్టుకొని దారుణంగా హింసకు గురి చేసిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వైరల్ గా మారిన వీడియోను చూసిన వారంతా షాక్ తింటున్నారు. ఇంతలా హింసకు గురి చేయటమా? అంటూ విస్మయానికి గురవుతున్నారు. రక్తం వచ్చేలా కొట్టిన తర్వాత కూడా కసి తీరక.. ఇంకా కొడుతూ.. బాధితుడి నోట్లో మూత్రం పోయటం.. కొట్టే వ్యక్తి మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలంటూ హింసకు గురి చేసిన ఉదంతం ఏపీలో వెలుగు చూసింది.

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడు అంజి.. బాధితుడైన గిరిజన యువకుడు మోటా నవీన్ లు ఇద్దరు చిన్నప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ నేరాలకు పాల్పడేవారు. వీరిద్దరు స్నేహితులు. ఇద్దరిపైనా యాభైకు పైగా కేసులు ఉన్నాయి. వీరిలో నవీన్ పలుమార్లు పోలీసులకు చిక్కి.. జైలుశిక్ష అనుభవించాడు. అంజి మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే.. వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

నెల క్రితం నవీన్ ను మందు తాగుదామని అంజి పిలిచాడు. ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలో పార్టీ పేరుతో ఆహ్వానించారు. నవీన్ అక్కడకు వెళ్లేసరికి.. అంజితో పాటు ఒంగోలు ఇస్లాంపేట.. గోపాల్ నగర్.. బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన మొత్తం తొమ్మిది మంది యువకులు ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో అంజి పాత వివాదాన్ని ప్రస్తావించాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.

అయితే.. ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా నవీన్ ను మందు పార్టీకి పిలిచిన అంజి.. తన తోటి వారితో కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. గాయాలతో రక్తం కారుతున్న వేళ.. తనను విడిచిపెట్టాలని కోరినా పట్టించుకోలేదు. దారుణంగా కొడుతూనే.. నవీన్ నోట్లో మూత్రం పోస్తూ తాగాలని బలవంతం చేశారు. అంతేకాదు.. దాడికి పాల్పడుతున్న వారి మర్మాంగాన్ని నోట్లో పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ దారుణాన్ని సెల్ ఫోన్ లో షూట్ చేశారు.

ఈ దాడి అనంతరం పోలీసులకు నవీన్ కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. అయితే.. దాడికి పాల్పడిన వారు నవీన్ ను తామెంత దారుణంగా హింసించామన్న విషయాన్ని చెప్పేందుకు వీలుగా తాము తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది కాస్తా వైరల్ గా మారటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడు తప్పించుకోగా.. ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ఏపీ పోలీసింగ్ పై విమర్శలు చేస్తున్నారు.