Begin typing your search above and press return to search.

ఇది చారిత్ర‌క ఘ‌ట్టం.. మిస్‌కావొద్దు: చంద్ర‌బాబు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు చారిత్రక ఘట్టమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ కూటమి ఎంపీలు మహిళా ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకుని ఢిల్లీకి రావాలని సూచించారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు మద్దతు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ కూడా తమ ఎంపీలకు సూచించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

By:  Garuda Media   |   29 Nov 2026 9:20 PM IST
ఇది చారిత్ర‌క ఘ‌ట్టం.. మిస్‌కావొద్దు:  చంద్ర‌బాబు
X

పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయ‌ని.. ఇదొక చారిత్ర‌క ఘ‌ట్ట మ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. దీనిని ఎవ‌రూ మిస్ చేసుకోవ‌ద్ద‌ని తెలిపారు. టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ రాష్ట్ర ఎంపీ ల‌తో నేరుగా ఆదివారం ఆయ‌న టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంటులో రెండు రోజుల పాటు జ‌రిగే కార్య‌క్ర‌మాల‌పై దిశానిర్దేశం చేశారు. అందరిక‌న్నా.. ముందు ఉండాల్సింది.. ఏపీలోని ఎంపీలేన‌ని ముఖ్యంగా కూట‌మి ఎంపీలేన‌ని చెప్పారు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా.. ప‌క్క‌న పెట్టి ఢిల్లీకి వెళ్లాల‌న్నారు.

తాను కూడా స్వ‌యంగా ఢిల్లీకి వ‌స్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. కుదిరితే పార్ల‌మెంటు వీక్ష‌కుల గ్యాల‌రీ నుంచి ఈ చారిత్ర‌క ఘ‌ట్టాన్ని వీక్షిస్తాన‌ని చంద్ర‌బాబు తెలిపారు. అదేస‌మ‌యంలో ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, గ్రామ పంచాతీయ ఎన్నిక‌ల‌లో విజ‌యం ద‌క్కించుకున్న మ‌హిళ‌ల‌ను ఎంపీలు త‌మ వెంట పెట్టుకుని ఢిల్లీకి తీసుకురావాల‌ని సూచించారు. మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం ఏపీకి అత్యంత కీల‌క‌మ న్న విష‌యాన్ని ఢిల్లీలో చాటాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. పార్టీ త‌ర‌ఫునే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా.. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించాల‌ని సూచించారు.

పార్ల‌మెంటు రెండు రోజుల స‌మావేశంలో మ‌హిళా బిల్లుతోపాటు.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న బిల్లుల‌కు అంద‌రూ మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని.. గ‌తంలో మాదిరిగా వీగిపోయే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఈ ఘ‌ట్టాన్ని మ‌హిళ‌లు, మ‌హిళా ప్రజాప్ర‌తినిధులు నేరుగా వీక్షించే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ న్నారు. తెలుగు మ‌హిళ‌(టీడీపీ అనుబంధ విభాగం) విభాగం మ‌హిళా నాయ‌కుల‌ను కూడా తీసుకుని.. ఢిల్లీకి రావాల‌ని పార్టీ ఎంపీల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

వైసీపీ సైతం..

మ‌రోవైపు కేంద్రంలో భాగ‌స్వామ్య ప‌క్షం కాక‌పోయినా.. పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టే మ‌హిళా, పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ బిల్లుల‌కు వైసీపీ మ‌ద్ద‌తు తెలిపింది. ఆదివారం ఢిల్లీలో మీడియాతోమాట్లాడిన ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి.. మ‌హిళ‌ల‌కు ప్రజాప్ర‌తినిధులుగా అవ‌కాశం మ‌రింత పెర‌గాల‌ని ఆకాక్షించే పార్టీ వైసీపీనేన‌ని పేర్కొన్నారు. త‌మ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌.. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు విశేష భాగ‌స్వామ్యం క‌ల్పించార‌ని తెలిపారు. అలాగే.. 50 శాతం మేర‌కు సీట్ల‌ను పెంచుతున్న నేప‌థ్యంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఏపీలో పెర‌గ‌నున్నాయ‌ని.. చెప్పారు. ఈ రెండు బిల్లుల‌కు తమ పార్టీ ఎంపీలు సంపూర్ణంగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పార్టీ అధ్య‌క్షుడు ఇప్ప‌టికే త‌మ‌కు చెప్పార‌ని వివ‌రించారు.