Begin typing your search above and press return to search.

లోకేష్‌పై ఆ 'మ‌చ్చ‌లు' పోతున్నాయ్‌.. !

టీడీపీలో వారసత్వ రాజకీయాలు లేవని, నాయకత్వ అవకాశాలు సామర్థ్యం, ప్రజాదరణ ఆధారంగానే దక్కుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టపడే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. నారా లోకేష్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలోనూ తొందరపడటం లేదని, రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై మరింత పట్టు సాధించేలా ప్రోత్సహిస్తున్నారని కథనం పేర్కొంది.

By:  Garuda Media   |   14 Nov 2026 3:00 PM IST
లోకేష్‌పై ఆ మ‌చ్చ‌లు పోతున్నాయ్‌.. !
X

తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో వారసత్వ రాజకీయాలు ఉంటాయ‌ని.. వ‌చ్చే అధ్య‌క్షుడు నారా లోకేషేన‌ని త‌ర‌చుగా వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. అయితే.. ఇలాంటి వాటికి తాజాగా సీఎం చంద్ర‌బాబు చెక్ పెట్టారు. పార్టీలో వార‌సత్వ రాజ‌కీయాలు లేవని స్పష్టం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలే అసలైన బలమని, నాయకత్వ అవకాశాలు కేవలం సామర్థ్యం, ప్రజాదరణ ఆధారంగానే దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ విష యంపై తాను క్లారిటీతోనే ఉన్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న‌ నారా లోకేష్ విషయంలో కేవలం వారసత్వం వల్ల కాకుండా, ఆయనకున్న సానుకూలతలు, క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఆధారంగానే పార్టీలో అవకాశాలు దక్కుతున్నాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఐటీడీపీని క్షేత్ర‌స్థాయిలో న‌డిపి.. పార్టీకి వెన్నెముక‌గా మారారు. ముఖ్యంగా వ‌స్తున్నా మీ కోసం పాద‌యాత్ర స‌మ‌యంలో క్షేత్ర‌స్థాయి కేడ‌ర్‌ను తెర‌వెనుక ఉండి న‌డిపించారు. ఫ‌లితంగా పార్టీ విజ‌య తీరాల‌కు చేరింది. దీనికి ప్ర‌తిఫ‌లంగానే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ, అనంత‌రం మంత్రి ప‌ద‌వి ద‌క్కాయి.

ఇక‌, పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పే చంద్ర‌బాబు నిజంగానే ఆ ప‌ని చేస్తున్నారు. నమ్మకంతో నడిచే పార్టీ నేత‌ల‌కు ప్ర‌ధానంగా ప‌ద‌వులు ఇస్తున్నారు. ఇలా వ‌చ్చిన వారిలో గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యేగ‌ల్లా మాధ‌వి పార్టీలో చేరిన మూడేళ్ల కాలంలోనే పొలిట్ బ్యూరో ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక‌, లోకేష్ విష‌యానికి వ‌స్తే.. పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు తీసుకుంటార‌న్న ప్ర‌చారంఉన్నా.. ఇప్ప‌ట్లో కాద‌న్న సంకేతాల‌ను చంద్ర‌బాబు ఇస్తున్నారు.

దీనికి కార‌ణం.. మ‌రింత‌గా ప్రాంతీయ‌, జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో కేంద్రం స‌హా రాష్ట్ర రాజ‌కీయాల‌పై ప‌ట్టు పెంచుకునేలా ఆయ‌న‌ను ప్రోత్స‌హిస్తున్నారు. పార్టీ కేవలం ఎన్నికల కోసమే కాకుండా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తుందని, యువతకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్న చంద్ర‌బాబు ఇదే కోణంలో నారా లోకేష్‌ను కూడా తీర్చిదిద్దుతున్నారు. ఏదేమైనా వార‌సత్వం ముసుగులో పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేది లేద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు తేల్చేయ‌డంతో విమ‌ర్శ‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డింద‌ని అంటున్నారు.