Begin typing your search above and press return to search.

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో 69 శాతం మేర‌కు పోలింగ్ న‌మోదైంది. దీనితో పోల్చుకుంటే.. ఇప్పుడు సగ‌టున 55 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదైంది.

By:  Tupaki Desk   |   3 Nov 2026 4:25 PM IST
ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !
X

తాజాగా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల పోలింగ్ ఒక‌ర‌కంగా ఫ‌స్ట్ ఎపిసోడ్‌గానే చూడాలి. ఎందుకంటే.. అన్ని పార్టీల‌కూ కీల‌క‌మైన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు ముందున్నాయి. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో వాస్త‌వ పోలింగ్ శాతం గ‌తంతో పోల్చుకుంటే బాగా త‌గ్గుముఖంప‌ట్టింది. 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో 69 శాతం మేర‌కు పోలింగ్ న‌మోదైంది. దీనితో పోల్చుకుంటే.. ఇప్పుడు సగ‌టున 55 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదైంది. ఈ ప‌రిణామాలు.. అన్ని పార్టీల‌కూ అనేక విష‌యాల‌ను నేర్పుతున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి: ఏ పార్టీలో అయినా.. నాయ‌కుల మ‌ధ్య‌క‌లివిడి ముఖ్యం. కూట‌మి పార్టీల్లో అధిష్టానాలు ప‌దే ప‌దే చెప్పినా.. ఈ త‌ర‌హా క‌లివిడి లేని చోట చాలా వ‌ర‌కు ఓటింగ్ త‌గ్గిపోయింది. విశాఖ‌, విజ‌య‌వాడ వంటి కీల‌క న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ప‌రిధిలో 50 శాతం ఓటు బ్యాంకు కూడా మించ‌లేదు. దీనికి కార‌ణం.. చివ‌రి నిమిషం వ‌ర‌కు కూడా పార్టీలో ఐక్య‌త సాధించే ప్ర‌య‌త్నం చేసినా.. దానిని అందుకోలేక పోవ‌డ‌మేన‌ని అంటున్నారు. త‌ద్వారా పోలింగ్‌పై ప్ర‌జ‌లు నిరాస‌క్త‌త చూపించారు.

ప్ర‌భుత్వ ప‌నితీరు: ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండం అని కూట‌మి పార్ట‌లు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. స‌హ‌జంగానే రెండున్న రేళ్ల ప్ర‌భుత్వ పాల‌న త‌ర్వాత‌.. వ‌చ్చిన ఎన్నిక‌లు కావ‌డంతో అంద‌రూ రిఫ‌రెండంగానే భావిస్తారు. ఈ ప‌రంగా చూసుకుంటే.. ఓటింగ్ శాతం త‌గ్గ‌డంపై ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేసుకోవాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కీల‌క‌మైన ప‌థ‌కాల విష‌యంలో జ‌రుగుతున్న జాప్యం పెద్ద‌గా ప్ర‌భావం చూపిస్తోంద‌న్న‌దివారి మాట‌. నిజానికి ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం తీసుకువ‌చ్చిన ఓట్లు కొంత మేర‌కు ప్ర‌భుత్వానికి ప్ల‌స్ అయ్యాయ‌న్న వాద‌న కూడా ఉంది.

ప్ర‌జ‌ల్లో మార్పు: స్థానిక సంస్థల ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తారు. అయితే.. ఈ సారి మా త్రం ఈ త‌ర‌హా సంస్కృతి కొర‌వ‌డింది. అదేస‌మ‌యంలో ప్ర‌చారానికి కూడా పెద్ద‌గా గ‌డువు లేక‌పోవ‌డం, మ‌ధ్య‌లో తుఫాను బీభ‌త్సం వంటివి కూడా ఈ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపించాయ‌ని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. ప్ర‌జల్లో కొంత నిరాస‌క్త‌త అయితే క‌నిపించింది. అంతాబాగానే ఉంద‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. ప్ర‌స్తుతం జ‌రిగిన ఓటింగ్ ను అంచ‌నా వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అనంత‌రం మార్పుల దిశ‌గా అడుగులు వేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.