చంద్రబాబుకు బిగ్ టెస్ట్ పెట్టేసిన అనంత తమ్ముళ్లు..!
కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు జడ్పీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వేముల శారద 7,336 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇప్పుడు ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకోవాలన్న చర్చ మొదలైంది. రెబల్స్‌ను చేర్చుకునేది లేదన్న చంద్రబాబు నిర్ణయంతో శారద విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
By: Garuda Media | 16 Nov 2026 2:19 AM IST''కూటమి అభ్యర్థులను గెలిపించాలి. కూటమి పార్టీల మధ్య కలివిడి ఉండాలి. ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపిం చే బాధ్యత నాయకులదే. ఎవరైనా కాదు.. కూడదని రెబెల్స్‌గా బరిలోకి దిగితే.. వారిపై వేటు వేస్తాం. ఎట్టి పరిస్థితి లోనూ పార్టీలో చేర్చుకునేది కూడా లేదు.'' ఈ నెలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు చేసిన దిశానిర్దేశం ఇది!. అయితే..చంద్రబాబు ఈ మాట చెప్పేసరికే.. చాలా మంది నాయకులు రెబెల్స్‌గా బరిలో నిలిచారు. ఓడినవారు ఓడారు. గెలిచిన వారు గెలిచారు.
దాదాపు 32 మందినాయకులపై పార్టీ కూడా సస్పెన్షన్ వేటు వేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీకి ప్రాణ సంకటమైన పరిణామం తెరమీదకు వచ్చింది. జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు నాయకుల వ్యవహా రం అనంతపురం జిల్లాలో చర్చ తెరమీదికి వచ్చింది. అది కూడా అమిలినేని సురేంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరగడం గమనార్హం. ఈయనకు చంద్రబాబు వద్ద మంచి పేరున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
విషయం ఏంటంటే..
కల్యాణ దుర్గం నియోజకవర్గం పరిధిలోని కంబదూరు నుంచి వేముల శారద ఇండిపెండెంటుగా విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి ఈమె టీడీపీ టికెట్ ఆశించారు. కానీ, ఇవ్వలేదు. దీంతో స్వతంత్రంగా నామినేషన్ వేశారు. ఫలితాల్లో 7,336 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఈమెకు టీడీపీ తరఫున భారీ మద్దతు లభించింది. దీంతో విజయం వరించిందన్న టాక్ ఉంది. వాస్తవానికి ఈ టికెట్‌ను జనసేనకు కేటాయించారు. ఆ జనసేనను ఓడించే శారద విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్.
అయితే.. ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి టీడీపీలో చేర్చుకునేందుకు తెరచాటు మంతనాలు ప్రారంభమయ్యాయి. కానీ అధినేత చంద్రబాబు మాత్రం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా రెబల్స్‌గా పోటీ చేసిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునేది లేదని చెప్పేశారు. మొత్తం 31 జడ్పీటీసీ స్థానాల్లో కూటమిలోని టీడీపీ 25, జనసేన 1, బీజేపీ 1 స్థానం సాధించి పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కంబదూరు నుంచి గెలిచిన శారదను జడ్పీ చేయాలన్నది ఇక్కడి నాయకుల వాదన మరికొద్ది రోజుల్లో నే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో చంద్రబాబుకు ఈ విసయం పంటి కింద రాయిగా మారింది. శారద విషయంలో తీసుకునే నిర్ణయం కూడా కీలకంగా మారనుంది.
