వీకెండ్ మస్తీ మజా.. ఓటీటీలోకి ఏకంగా 30 చిత్రాలు, వెబ్ సిరీస్ లివే!
కరోనా సమయం నుంచి ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.;
కరోనా సమయం నుంచి ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. టికెట్ల రేటు కూడా అధికంగా ఉండడంతో చాలామంది థియేటర్లకు వెళ్లడానికి మక్కువ చూపడం లేదు. అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన 20, 30 రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ప్రతి శుక్రవారం కూడా ఓటీటీలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ వారం వీకెండ్ లో భాగంగా ప్రేక్షకులను అలరిస్తున్న సినిమాల గురించి చూద్దాం.
హృదయపూర్వం:
మలయాళ నటుడు మోహన్ లాల్, మాళవిక జంటగా నటించారు. డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఘాటీ:
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
సుందరకాండ:
నారా రోహిత్ హీరోగా, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘని నటించారు. ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
సన్నాఫ్ సర్దార్ 2:
అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ నటించారు. ఈ సినిమా సన్నాఫ్ సర్దార్ సినిమాకి కొనసాగింపు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
దఢక్ 2:
సిద్ధార్థ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ఇది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
వీటి తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్, చిత్రాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
జియో హాట్ స్టార్ :
1).ది మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ - ఇంగ్లీష్ మూవీ
2). పార్క్ ట్యాంక్ -ఇంగ్లీష్ మూవీ
3). ది డెవిల్ ఈజ్ బిజీ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
4). తస్లా కింగ్- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 3
5). లలిత్ ఫెయిర్-బిల్డింగ్ ఎ మిస్టరీ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
అమెజాన్ ప్రైమ్:
1). అపూర్వ పుత్రన్మార్ - మలయాళ మూవీ
2). ఫీనిక్స్ - తమిళ మూవీ
3). మా దేవా- కన్నడ మూవీ
4). మామ్ - ఇంగ్లీష్ మూవీ.
5). టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ - హిందీ షో
నెట్ ఫ్లిక్స్:
1). ఒదుం కుతిరా చాదుమ్ కుతిరా - మలయాళం/తెలుగు
2). మాంటిస్ - కొరియా
3). వేవార్డ్- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1
4). ది గెస్ట్ -స్పానిష్ వెబ్ సిరీస్ సీజన్ 1
5). హౌస్ ఆఫ్ గిన్నిస్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1/తెలుగు
6). మాన్స్టర్ హై - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1
7). క్రైమ్ సీన్ జీరో- కొరియన్ రియాల్టీ షో
సన్ నెక్స్ట్:
మేఘాలు చెప్పిన ప్రేమ కథ - తెలుగు
దూర తీర యాన- కన్నడ
జీ - 5:
సుమతి వాలవు - మలయాళం
జాన్వర్ - హిందీ వెబ్ సిరీస్ సీజన్ 1
యాపిల్ టీవీ:
స్లో హార్స్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 5
ఆల్ ఆఫ్ యు - ఇంగ్లీష్ మూవీ.