తనూజ టాప్ లో వెళ్తుంది.. ఇది కూడా ప్లస్ అయ్యింది..!

బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతి సిచువేషన్ కూడా తనూజకి హౌస్ లో మైనస్ అవుతుందేమో కానీ బయట ఆడియన్స్ లో మాత్రం ఆమెకు సూపర్ ప్లస్ అవుతుంది.;

Update: 2025-11-08 05:22 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతి సిచువేషన్ కూడా తనూజకి హౌస్ లో మైనస్ అవుతుందేమో కానీ బయట ఆడియన్స్ లో మాత్రం ఆమెకు సూపర్ ప్లస్ అవుతుంది. ముఖ్యంగా కెప్టెన్ అయ్యేందుకు తనూజ పడుతున్న తపన ఆమెను ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తుంది. తనూజ ఐదో వారం నుంచి కెప్టెన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. దాదాపు ఆమె గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోతుంది. అది కూడా చివరి నిమిషంలో హౌస్ మేట్స్ సపోర్ట్ వల్లో లేదా టాస్క్ ఓడిపోవడమో ఇలా జరుగుతుంది. ఐతే ఈసారి కెప్టెన్ గా తనూజ ఫిక్స్ అని అనుకునేలోగా దివ్య వచ్చి చెక్ పెట్టింది.

కెప్టెన్ రేసు నుంచి దివ్య తనూజని తప్పించడం..

దివ్య, తనూజ మధ్య రైవల్రీ పెద్దగా లేకపోయినా ఇమ్మాన్యుయెల్ ని గెలిపించాలని దివ్య తనూజని తీసేయడం హౌస్ మెట్స్ కి కూడా కొందరికి నచ్చలేదు. తనూజ కూడా కెప్టెన్ రేసు నుంచి దివ్య తప్పించడంతో వెళ్లి తన బెడ్ మీద పడుకుని చాలా ఎమోషనల్ అయ్యింది. బాగా ఏడ్చింది కూడా.. తనూజ ఇది ఒకటి రెండుసార్లు కాదు దాదాపు నాలుగైదు సార్లు ఆమె చివరి దాకా వచ్చి ఓడిపోతుంది.

లాస్ట్ వీక్ కూడా దివ్య, తనూజ ఫైనల్ రౌండ్ లో ఉండగా హౌస్ మెట్స్ అంతా తనూజని కాదని దివ్యకు సపోర్ట్ చేశారు. అలా దివ్య కెప్టెన్ అయ్యింది. ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయెల్ కి సపోర్ట్ చేస్తూ దివ్య తనూజని తీసేయడం అసలేమాత్రం మెచ్చుకునే అంశంగా అనిపించలేదు. ఐతే తనూజకి కెప్టెన్సీ రాకపోయినా ఆమెకు నిన్న ఎపిసోడ్ మరింత పాజిటివ్ అయ్యింది. ఆమెకు బీభత్సమైన ఓటింగ్ వస్తుంది.

ఆల్రెడీ టాప్ లో ఉన్న తనూజ ఈ ఎపిసోడ్స్ వల్ల..

తనూజ స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలిసే ఇమ్మాన్యుయెల్, దివ్య కావాలని ఆమెని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దివ్య తో పాటు ఇమ్మాన్యుయెల్ కూడా సేఫ్ గేం ఆడుతూ తనూజ మీద సైలెంట్ టార్గెట్ పెడుతున్నాడు. ఏది ఏమైనా ఆల్రెడీ టాప్ లో ఉన్న తనూజ ఈ ఎపిసోడ్స్ వల్ల మరింత టాప్ లేపేస్తుంది. అంతేకాదు సీజన్ విన్నర్ కి ఇమ్మాన్యుయెల్ దూరంగా వెళ్తుంటే తనూజ మరింత దగ్గర అవుతుందని అనిపిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ ప్లేయర్స్ గా దూసుకెళ్తున్న ఇమ్మనయుయెల్, తనూజ ఇద్దరు ఫన్ టైంలో బాగానే ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఐతే అది కాకుండా ఏదైనా టాస్క్ లు వచ్చినప్పుడు మాత్రం ఇమ్మాన్యుయెల్ తను ఒక్కడే గెలవాలని ఆడుతున్నాడు. అఫ్కోర్స్ ఆటలో అలా ఉండటం కరెక్టే కానీ కొన్ని చోట్ల టాస్క్ కన్నా ఆడియన్స్ మనసులు గెలవడం కూడా ఆటలో భాగమే అవుతుంది. ఆ లాజిక్ ని ఇమ్మాన్యుయెల్ మర్చిపోతున్నాడు.

తాను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈసారి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇద్దామన్న ఆలోచన అసలు ఒకసారి కూడా రాలేదు. ఇమ్మాన్యుయెల్ అది ఆట అనుకున్నా అతని మైండ్ సెట్ ఏంటన్నది ఆడియన్స్ డీకోడ్ చేస్తున్నారు.

Tags:    

Similar News