ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన షైన్ టామ్ చాకో సూత్రవాక్యం..ఎక్కడ చూడొచ్చో తెలుసా?

షైన్ టామ్ చాకో,విన్సీ ప్రధాన పాత్రలు పోషించిన సూత్రవాక్యం మూవీకి యుజియన్ జోస్ చిరమ్మిల్ దర్శకత్వం వహించగా.. కండ్రేగుల లావణ్య రాణి ఈ సినిమాని నిర్మించారు.;

Update: 2025-08-21 10:06 GMT

మలయాళం నటుడు షైన్ టామ్ చాకో అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ నాని దసరా మూవీ విలన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. మలయాళంలో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో తెలుగులో దసరా మూవీతో పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఆయన నటనకి చాలామంది ఫిదా అవ్వడంతో తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రశంసించారు. అయితే రీసెంట్ గా షైన్ టామ్ చాకో నటించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'సూత్రవాక్యం' థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమాని ఓటీటీ లోకి తీసుకువచ్చారు. ఒకటి కాదు రెండు ఓటీటీ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోందో ఇప్పుడు చూద్దాం..

2 వెర్షన్లలో 2 ఫ్లాట్ ఫామ్ లలో అందుబాటులోకి..

షైన్ టామ్ చాకో,విన్సీ ప్రధాన పాత్రలు పోషించిన సూత్రవాక్యం మూవీకి యుజియన్ జోస్ చిరమ్మిల్ దర్శకత్వం వహించగా.. కండ్రేగుల లావణ్య రాణి ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ మలయాళ సినిమాని మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. థియేటర్లలో తెలుగు వెర్షన్ లో విడుదల చేయకపోయినప్పటికీ ఓటీటీలో అయినా తెలుగు వెర్షన్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలో సూత్రవాక్యం సినిమా మలయాళం వెర్షన్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఆగస్టు 21 అనగా ఈరోజు నుండి స్ట్రీమింగ్

అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ ని ఈటీవీ Win లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా థియేటర్లలో తెలుగు వెర్షన్ లో విడుదల చేయడానికి వీలు కాకపోయినప్పటికీ ఓటిటి ద్వారా తెలుగు వర్షన్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి థియేటర్లలో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ సూత్రవాక్యం మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి..

షూటింగ్ సమయంలో నటీనటుల మధ్య వివాదం..

ఇక సూత్రవాక్యం మూవీ సమయంలో ఒక వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. అదేంటంటే.. ఈ సినిమాలో నటించిన షైన్ టామ్ చాకో తనతో అసభ్యంగా ప్రవర్తించారుడు అంటూ నటి విన్సీ మీడియా ముందు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. సినిమా షూటింగ్ సెట్లో షైన్ టామ్ చాకో మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అలా కొద్ది రోజులు ఈ వివాదం మలయాళ ఇండస్ట్రీలో దుమారం సృష్టించింది. కానీ ఈ మధ్యనే ఈ వివాదం సర్దుమనిగింది. రీసెంట్గా సూత్రవాక్యం మూవీ ప్రమోషన్స్ లో విన్సీ మాట్లాడుతూ.. "షైన్ టామ్ చాకో తనతో అసభ్యంగా ప్రవర్తించింది నిజమే.. కానీ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరారు.అందుకే మా మధ్య ప్రస్తుతం గొడవలేమీ లేవు. అన్నీ సర్దుకుపోయాయి" అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News