ఓటీటీలోకి వచ్చేసిన యూత్ బ్లాక్ బస్టర్ సైయారా.. ఎక్కడ చూడొచ్చంటే?

ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ ని ఓ లెవెల్ లో షేక్ చేశాయి. ఈ సినిమాలలో బాక్సాఫీస్ ని షేక్ చేసి.. యూత్ ని కన్నీళ్లు పెట్టించిన ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.;

Update: 2025-09-12 08:19 GMT

కంటెంట్ ఉంటే భారీ తారాగణం లేకపోయినా పరవాలేదు సినిమాలు హిట్ అయిపోతాయి అనడానికి ఉదాహరణగా ఎన్నో సినిమాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో వచ్చిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవడం లేదు. కారణం అందులో కంటెంట్ లేకపోవడమే.. కానీ ఎలాంటి భారీ తారాగణం లేకుండా.. భారీ బడ్జెట్ పెట్టకుండానే కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి.అలా ఈ మధ్యకాలంలో వచ్చిన లిటిల్ హార్ట్స్, సూ ఫ్రమ్ సో, కొత్త లోక, సైయారా, బలగం వంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల మదిదోచేశాయి. ఈ సినిమాలలో భారీ తారాగణం లేదు.. బడ్జెట్ కూడా ఎక్కువగా పెట్టలేదు.కానీ సినిమా రిజల్ట్ మాత్రం ఏ లెవెల్ లో ఉందో చెప్పనక్కర్లేదు.

యూత్ సైతం కన్నీళ్లు పెట్టించిన సైయారా..

ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ ని ఓ లెవెల్ లో షేక్ చేశాయి. ఈ సినిమాలలో బాక్సాఫీస్ ని షేక్ చేసి.. యూత్ ని కన్నీళ్లు పెట్టించిన ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే సైయారా.. బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సైయారా మూవీతో కొత్త హీరో, హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.వాళ్లే అహాన్ పాండే,అనిత్ పద్దా.. వీరిద్దరికి ఇదే మొదటి సినిమా. అయినా కానీ 10 సినిమాల అనుభవం ఉన్న వారిలా నటించారు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రొమాంటిక్ డ్రామా జానర్లో తెరకెక్కిన సైయారా మూవీ.. జూ లై 18న విడుదలై బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.

ఆషీకీ 2ని మించి పాపులారిటీ..

ముఖ్యంగా ఈ సినిమాలో ఫేమస్ అయిన నటీనటులు లేకుండానే సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిందంటే ఇందులో ఉన్న కంటెంట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అద్భుతమైన మ్యూజిక్, యూత్ ని ఆకట్టుకునే లవ్ ఎమోషనల్ సీన్స్, స్వచ్ఛమైన ప్రేమ కథ అనే అంశాలు సినిమాని హిట్ చేసాయి. ఈ సినిమాని థియేటర్లలో చూసిన చాలామంది యూత్ క్లైమాక్స్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు మనం ఇప్పటికే ఎన్నో చూసాం. ఈ సినిమా యూత్ మనసు దోచిన ఆషీకీ -2 మూవీ కంటే అద్భుతంగా ఉందని చాలామంది క్రిటిక్స్ కూడా రివ్యూ ఇచ్చారు.

నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్..

అయితే అలాంటి ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.జూలై 18న విడుదలైన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈరోజు అనగా సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో సైయారా మూవీని మిస్ అయినవాళ్లు ఇంట్లో నుండే చూసేయండి..

రూ.40 కోట్ల బడ్జెట్ తో రూ.580 కోట్లు వసూలు..

సైయారా మూవీ కేవలం రూ.30 నుండి రూ.40 కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.580 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసి భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా టాప్ ఆఫ్ ది బాలీవుడ్ గా కూడా మారిపోయింది.

Tags:    

Similar News