నెట్ ప్లిక్స్ లో సంచలనంగా మారిన స్పై థ్రిల్లర్!
సినిమాల్ని మించి ఓటీటీ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ఏ రేంజ్ లో సక్సస్ అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు.;
సినిమాల్ని మించి ఓటీటీ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ఏ రేంజ్ లో సక్సస్ అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన కంటెంట్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. బయోపిక్ లు, స్పై థ్రిల్లర్లు, క్రైమ్ స్టోరీలకు ఓటీటీలో డిమాండిప్పుడు మామూలుగా లేదు. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ తో కొట్టుకెళ్లిపోతున్నాయి. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది. రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.
నెట్ ప్లిక్స్ డేటా ఆధారంగా ఈ సిరీస్ కు తొలి వారంలోనే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో మోస్ట్ వాచ్ బుల్ సిరీస్ గా నిలిచింది. ఇంతకీ ఏంటా సిరీస్ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆ సిరీస్ పేరు 'సారే జహాసే అచ్చా'. 1966లో జరిగిన విమాన ప్రమాదంలో ఇండియన్ లెజెండరీ శాస్త్రవేత్త హోమి బాబా మర ణంతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. అటుపై 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్దంలో ఇద్దరు స్పైలు ఎదిగి న విధానం, 1992 స్కామ్ ను వెలుగులోకి తేవడం..పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను నాశనం చేయడం వంటి అంశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
మొత్తం ఆరు ఎపిసోడ్లు. ఒక్కోటి 40 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇందులో ప్రతీక్ గాంధీ మెయిన్ లీడ్ పోషించారు. సన్నీ హిందూజ, సుహైల్ నాయర్, తిలోత్తమ షోమ్, అనూప్ సోనీ కీలక పాత్రల్లో మెప్పిం చారు. ఒక్కో ఎపిసోడ్ చూస్తున్నకొద్ది చూడాలనిపించే ఫీల్ తీసుకొస్తుంది. స్టోరీ నేరేషన్ ఆద్యంతం ఆసక్తి కరంగా చెప్పుకొచ్చారు. సుహైల్ నయ్యర్ పాత్ర మరింత ఎగ్జైట్ మెంట్ ను తీసుకొస్తుంది. సహజ నటనతో ఆకట్టుకుంటాడు. పాత్రలో ఎక్కడా అతి అనిపించదు. అతడి పాత్ర ముగిసిన సిరీస్ కే హైలైట్ గా నిలుస్తుంది.
ప్రతీ థ్రిల్లర్ సిరీస్ కు ఇలాంటి రోల్ ఒకటి అవసరం అనిపించేలా దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేసాడ నిపిస్తుంది. నయ్యర్‌తో పాటు, సన్నీ హిందూజా ఐఎస్ చీఫ్ రోల్ అంతే ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీక్ గాంధీ రోల్ ని సైతం డామినేట్ చేసాలా ఉంటాయి ఆ పాత్రలు. అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఆ రోల్స్ సిరీస్ పై మరింత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఆసక్తిని రేకెత్తించే బీజీఎమ్ అంతే హైలైట్ అవుతుంది. సెజల్ షా, భావేష్ మండాలియా సంయుక్తంగా నిర్మించిన సిరీస్ కు సుమిత్ పురోహిత్ దర్శకత్వం వహించారు.