పరాశక్తి డిజిటల్ డీల్.. సౌండ్ అదిరింది..?
జీ 5 తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా పరాశక్తి ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడింది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకు 45 కోట్లు డీల్ తో రాగా జీ 5 ఓటీటీ సంస్థ మరో 7 కోట్లు అదనంగా అంటే 52 కోట్లతో డీల్ సెట్ చేసుకుంది.;
కోలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు శివ కార్తికేయన్. వీజే గా మొదలు పెట్టిన అతని కెరీర్ హీరోగా మారి సూపర్ సక్సెస్ లతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న శివ కార్తికేయన్ అమరన్ సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ తో సత్తా చాటాడు. ఐతే రీసెంట్ గా మురుగదాస్ తో అతను చేసిన మదరాసి సినిమా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం సుధ కొంగర డైరెక్షన్ లో పరాశక్తి సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్.
వ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా..
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడికల్ కథతో వస్తున్న పరాశక్తి సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు. పరాశక్తి సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్స్ మంచి డిమాండ్ ఏర్పడింది. రెండు బడా ఓటీటీ సంస్థలు పరాశక్తి డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి.
జీ 5 తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా పరాశక్తి ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడింది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకు 45 కోట్లు డీల్ తో రాగా జీ 5 ఓటీటీ సంస్థ మరో 7 కోట్లు అదనంగా అంటే 52 కోట్లతో డీల్ సెట్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం లకు పోటీగా ఇప్పుడు జీ 5 కూడా రంగంలోకి దిగి భారీ సినిమాలను కొనుగోలు చేస్తుంది. పరాశక్తి సినిమా డిజిటల్ రైట్స్ డీల్ తో కూడా క్రేజ్ సంపాదించుకుంది.
రవి మోహన్ ప్రతినాయకుడు పాత్రలో..
శివ కార్తికేయన్ మార్కెట్ ఎలా ఉంది అన్నది ఈ డీల్ తోనే తెలుస్తుంది. ఈ మూవీలో అధర్వ మురళి కూడా నటిస్తున్నాడు. అంతేకాదు రవి మోహన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సో కోలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ మూవీగా పరాశక్తి వస్తుంది. ఐతే నెక్స్ట్ పొంగల్ రేసులోనే దళపతి విజయ్ సినిమా జన నాయగన్ వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది.
ఈమధ్య సినిమా గ్లింప్స్ తోనే రేంజ్ అంచనా వేస్తున్నారు. దానికి తగినట్టుగానే డిజిటల్ రైట్ డీల్ జరుగుతుంది. పరాశక్తి సినిమా డిజిటల్ రైట్స్ ఫైనల్ గా జీ 5 దక్కించుకుంది. మదరాసి డిజప్పాయింట్ చేయడంతో పరాశక్తితో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు శివ కార్తికేయన్. సుధ కొంగర తన మార్క్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. శివ కార్తికేయన్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను భారీ రిలీజ్ ప్లాన్ జరుగుతుంది.