అక్కడ ఫ్యామిలీ మ్యాన్ తర్వాత కాంతార1కే స్థానం
ఇండియన్ సినీ వరల్డ్ లో సత్తా చాటిన కాంతార చాప్టర్1 ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందింది.;
ఇండియన్ సినీ వరల్డ్ లో సత్తా చాటిన కాంతార చాప్టర్1 ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందింది. అన్ని రకాల ఆడియన్స్ ను అలరించి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకున్న కాంతార1 రిలీజ్ తోనే దేశవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకోవడమే కాకుండా కెజిఎఫ్2 తర్వాత కన్నడ ఇండస్ట్రీలో రెండో అతి భారీ హిట్ గా నిలిచింది.
డీల్ వల్ల ఆలస్యమైన హిందీ ఓటీటీ రిలీజ్
ఆడియన్స్ తో పాటూ క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలందుకున్న కాంతార1 అక్టోబర్ 31 నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాంతార1 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు అక్టోబర్ 31 నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాగా, హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగా ఓటీటీలో రిలీజైంది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం హిందీ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం 8 వారాలైనా పూర్తవాలి.
టాప్2 ప్లేస్ లో కాంతార1
రీసెంట్ గా గురువారం నుంచి కాంతార చాప్టర్1 హిందీ వెర్షన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాగా, ఈ మూవీ రిలీజైన రెండు రోజుల్లోనే డబ్బింగ్ వెర్షన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యొక్క ఇండియన్ చార్ట్స్ లో టాప్2 ప్లేస్ ను దక్కించుకుని మరోసారి కాంతార1 వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్స్ లో మనోజ్ బాజ్‌పాయి నటించిన సెన్సేషనల్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్3 మొదటి ప్లేస్ లో ఉంది.
కాంతార చాప్టర్1 లోని దేవతారాధన, గ్రామీణ సంప్రదాయాలు, అటవీ సంస్కృతి, యాక్షన్ సీన్స్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు చేర్చగా ఈ సీన్స్ అన్నీ నార్త్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించగా, అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఏదేమైనా సినిమాలో మంచి కంటెంట్ ఉంటే కేవలం బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓటీటీ తో కూడా సెన్సేషన్ సృష్టించొచ్చని కాంతార1 ప్రూవ్ చేసింది.