ఓటీటీలోకి డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.;
థియేటర్లలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేయడానికి కొన్ని చిత్రాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి డ్యూడ్. ఇటీవల డ్రాగన్ తో మంచి విజయం అందుకున్న ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు మూవీతో భారీ పాపులారిటీ అందుకున్న మమిత బైజు జంటగా.. తమిళ్ లో టాలీవుడ్ బడా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం డ్యూడ్. భారీ అంచనాల మధ్య తమిళ్ , తెలుగు భాషల్లో దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అక్టోబర్ 17వ తేదీన వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా.. కొన్ని రోజుల తర్వాత హిందీ డబ్బింగ్ వెర్షన్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతుండడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు థియేటర్లలో 100కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
డ్యూడ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన గగన్ (ప్రదీప్) తన మామ , మినిస్టర్ (శరత్ ) కుమార్తె కుందన (మమిత బైజు) తో కలిసి తనకు నచ్చిన రీతిలో ఒక స్టార్టప్ కంపెనీ మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కుందన ఒకరోజు గగన్ మీద తనకున్న ప్రేమను బయటపెడుతుంది. అది ఒప్పుకోని గగన్ ఆమె మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని, చిన్నప్పటినుంచి స్నేహితురాలు గానే భావిస్తూ వచ్చానని చెబుతాడు. తర్వాత ఆమె మీద ఉన్నది ప్రేమేనని అర్థం చేసుకుంటాడు గగన్ . అయితే ఈ విషయాన్ని ముందుగా ఆమెకు చెప్పకుండా తన మామకు చెప్పి పెళ్లికి సిద్ధం చేస్తాడు.
అయితే పెళ్లికొక రోజు ముందు తాను మరో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి షాక్ ఇస్తుంది కుందన. అయితే ఈ విషయాన్ని తన తండ్రి దగ్గరికి చెప్పడానికి వెళ్లిన కుందనకి.. అనూహ్యంగా ఆమె తండ్రి షాక్ ఇస్తాడు.. అసలు కుందన్ తండ్రి ఇచ్చిన షాక్ ఏంటి? కుందన ప్రేమించిన వ్యక్తితో ఒక్కటయ్యిందా? లేక గగన్ ను పెళ్లి చేసుకుందా? ఇలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ఇందులో మమిత బైజు, ప్రదీప్ రంగనాథన్ తోపాటు రోహిణి, నేహా శెట్టి తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు.
ప్రదీప్ రంగనాథన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.