ఈవారం ఓటీటీ కంటెంట్.. ఇంకాస్త కొత్తగా..
పండగ సీజన్ అంటే థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ పెద్ద యుద్ధమే జరుగుతుంది.;
పండగ సీజన్ అంటే థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ప్రతీ ప్లాట్‌ఫామ్ తమ సబ్‌స్క్రైబర్లను అలరించడానికి కొత్త కంటెంట్‌తో రెడీ అయిపోతుంది. ఈ దీపావళి వీకెండ్‌కు కూడా ఓటీటీలో పెద్ద సందడే నెలకొంది. అయితే, ఈసారి అందరి చూపు ఒక సరికొత్త వెబ్ సిరీస్‌పై కాదు, కొన్ని నెలల క్రితం థియేటర్లను షేక్ చేసిన ఒక సినిమాపైనే ఉంది.
ఈ వారం ఓటీటీ లైనప్ ఒక మిక్స్‌డ్ బ్యాగ్ లా ఉంది. థియేటర్లలో ఫ్లాప్ అయిన కొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటే, మరికొన్ని యావరేజ్‌గా ఆడినవి సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీటికి తోడు కొన్ని కొత్త రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. కానీ, వీటన్నింటినీ డామినేట్ చేస్తూ, ఒకే ఒక్క తెలుగు సినిమా మాత్రం ఓటీటీ రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
ఆ సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’. థియేటర్లలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌కు ట్రీట్ ఇవ్వడానికి వచ్చేస్తోంది. దీపావళి కానుకగా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘OG’ స్ట్రీమింగ్ కానుంది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బాక్సాఫీస్ వద్ద సుమారు 320 కోట్లకు పైగా వసూలు చేసి, పవన్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు పండగ సెలవుల్లో ఇంట్లో కూర్చుని చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
‘OG’ హంగామా ఒకవైపు ఉంటే, మరోవైపు కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. విజయ్ ఆంటోనీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘భద్రకాళి’ థియేటర్లలో నిరాశపరిచినా, ఈ నెల 24 నుంచి జీయో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ నటించిన ‘పరమ్ సుందరి’ కూడా అదే రోజు ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇక మలయాళ ఫ్లాప్ ‘నడికర్’ లయన్స్ గేట్ ప్లేలో అందుబాటులోకి రానుంది.
వీటితో పాటు, ఈ వారం ఓటీటీలో రెండు విభిన్నమైన ‘మహాభారతం’ సిరీస్‌ల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఒకవైపు యానిమేటెడ్ సిరీస్ ‘కురుక్షేత్ర పార్ట్ 2’ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంటే, మరోవైపు ఇండియాలోనే మొదటిసారి పూర్తి ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ‘మహాభారత్ ఏక్ ధర్మయుధ్’ జీయో హాట్‌స్టార్‌లో పోటీకి దిగుతోంది.
కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లతో వస్తున్న ఫ్యాషన్ బిజినెస్ రియాలిటీ షో ‘పిచ్చ్ టూ గెట్ రిచ్’ కూడా ఈ వారమే మొదలవుతోంది. మొత్తం మీద, ఈ దీపావళి వీకెండ్‌కు ఓటీటీలో కంటెంట్‌కు కొదవే లేదు. అయితే, ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. అందరి ఛాయిస్, ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ‘OG’ తో పాటు AI ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ‘మహాభారత్ ఏక్ ధర్మయుధ్’ కూడా చూడాలని అనుకుంటున్నారు. ఇక థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన కొన్ని చిత్రాలే, ఈ మధ్య పండగ సీజన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అసలైన వ్యూస్‌ను తెచ్చిపెట్టే ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పవచ్చు. మరి ఈ వారం వచ్చే సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటాయో చూడాలి.