తనూజకి అన్యాయం చేసిన దివ్య.. భరణి కూడా ఫైర్..!
బిగ్ బాస్ సీజన్ 9లో మరోసారి తనూజ కెప్టెన్సీ ఆటలో చివరి వరకు వచ్చి తప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు ఐదో వారం నుంచి ఆమె కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ దాకా రావడం ఓడిపోవడం జరుగుతుంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో మరోసారి తనూజ కెప్టెన్సీ ఆటలో చివరి వరకు వచ్చి తప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు ఐదో వారం నుంచి ఆమె కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ దాకా రావడం ఓడిపోవడం జరుగుతుంది. ప్రతిసారి తనకు బ్యాడ్ లక్ వస్తుంది. ఐతే ఈసారి హౌస్ మెట్స్ అంతా కూడా తనూజకి సపోర్ట్ చేయాలని అనుకున్నా కూడా దివ్య తనూజ మీద ఉన్న పర్సనల్ గ్రడ్జ్ వల్ల ఆమెను కెప్టెన్సీ రేసు నుంచి తీసేసింది. భరణి విషయంలో తనూజ, దివ్య ఇద్దరిలో ఎవరు ఎక్కువ అన్నది ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది.
కెప్టెన్సీ కోసం ట్రైన్ టాస్క్ పెట్టిన బిగ్ బాస్..
భరణి ఆట వీళ్ల వల్ల పోతుందని తెలిసిన దగ్గర నుంచి తనూజ అతనికి కాస్త దూరమైంది. ఐతే దివ్య మాత్రం భరణిని వదల్లేదు. అతను హౌస్ నుంచి వెళ్లిపోవడానికి రీజన్ అయ్యింది. ఐతే ఎలాగోలా భరణి మళ్లీ తిరిగి వచ్చాడు. ఐతే ఇప్పుడు రీ ఎంట్రీలో కూడా భరణి దివ్య కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు. దివ్య కూడా అతని కోసం రీ ఎంట్రీ టైంలో ఆడింది.
ఐతే నిన్న కెప్టెన్సీ టాస్క్ లో ట్రైన్ టాస్క్ పెట్టిన బిగ్ బాస్ డ్రైవర్ గా ఎవరైతే ఎక్కుతారో వారి సైడ్ కూర్చున్న వారిలో నుంచి ఒకరిని తొలగించాలి. అలా ముందు రాము, నిఖిల్ ట్రైన్ ఎక్కగా రాము ట్రైన్ కదులుతుందని బిగ్ బాస్ చెప్పాడు. అతని ట్రైన్ లో తనూజ, భరణి ఎక్కారు. రాము భరణిని బయటకు తీసి తనూజకి సపోర్ట్ చేశాడు. నెక్స్ట్ సాయి దివ్యని తీస్తాడు. నిఖిల్ సుమన్ శెట్టిని రేసు నుంచి తప్పిస్తాడు. ఇక ఇమ్మాన్యుయెల్, రీతు, తనూజ ఉన్న టైం లో రెడ్ ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.
తనూజ పేరు చెప్పి ఆమెను ఆట నుంచి తొలగించింది..
ఆ టైంలో ట్రైన్ సీట్ ఎక్కేందుకు మిగతా కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ జరిగింది. కళ్యాణ్, రీతు ట్రైన్ సీటు చేజిక్కించుకునేందుకు ట్రై చేశారు. ఐతే ఈ కొట్లాటలో దివ్య తెలివిగా సీటు ఎక్కేసింది. ఆమె వచ్చి ఊహించని విధంగా తనూజ పేరు చెప్పి ఆమెను ఆట నుంచి తొలగించింది. తనూజని తీసేయడానికి దివ్య చెప్పిన రీజన్ నీకు హౌస్ అంతా సపోర్ట్ ఉంది. ఇమ్మాన్యుయెల్ కి తన సపోర్ట్ అన్నది. ఐతే తనూజ భరణి గారి విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నావ్.. ఏమన్నా పర్సనల్ టార్గెట్ ఉంటే బయట చూసుకుందాం ఇక్కడ వద్దని ఏడ్చుకుంటూ బెడ్ రూం లోకి వెళ్లింది.
దివ్య తీసుకున్న నిర్ణయం భరణికి కూడా నచ్చలేదు. భరణి వచ్చి తనూజని కన్ సోల్ చేశాడు. అతని గురిచి ప్రస్తావించింది అని దివ్య తిరిగి భరణి మీదే అరిచింది ఇప్పుడు తీసుకోవాలి స్టాండ్ అని.. ఐతే కొంతసేపటి తర్వాత భరణి దివ్య మీద ఏం మాట్లాడాలి.. తనూజకి తాను తర్వాత సర్ది చెప్పేవాడిని అంటూ గట్టిగా అరిచాడు వెంటనే దివ్య వెళ్లిపోయింది.
తనూజని దివ్య కావాలనే కెప్టెన్సీ రేసు నుంచి తప్పించిందని అందరు భావిస్తున్నారు. తనూజ విషయంలో దివ్య చేసిన పనికి ఆమె పై కాస్త నెగిటివిటీ వచ్చేలా ఉంది. ఐతే ఇదంతా తనూజకి చాలా ప్లస్ అయ్యేలా ఉంది.